ప్రకృతిని పలకరిస్తున్నారా...

మనలో చాలామంది సమయాభావంవల్ల వ్యాయామమైనా, విశ్రాంతి తీసుకోవడమైనా నాలుగు గోడల మధ్యనే చేస్తారు. అయితే తరచూ ప్రకృతిలో కాసేపైనా గడిపితే శారీరకంగా, మానసికంగా ఎంతో మేలంటున్నారు నిపుణులు.

Published : 30 May 2022 01:08 IST

మనలో చాలామంది సమయాభావంవల్ల వ్యాయామమైనా, విశ్రాంతి తీసుకోవడమైనా నాలుగు గోడల మధ్యనే చేస్తారు. అయితే తరచూ ప్రకృతిలో కాసేపైనా గడిపితే శారీరకంగా, మానసికంగా ఎంతో మేలంటున్నారు నిపుణులు.

పార్కులో కాసేపు నడవడం, ఆఫీసు లేదా ఇంటి కిటికీ నుంచి చెట్లని చూడటంవల్ల మన మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, గణన, సృజనాత్మకంగా ఆలోచించడం... ఇవన్నీ ప్రకృతిలో గడపడంవల్ల కలిగే ప్రయోజనాలే.

* మనిషిపై ప్రకృతి ప్రభావం గురించి అమెరికాలోని ఇలినాయిస్‌కు చెందిన ఓ పాఠశాల విద్యార్థుల మీద అధ్యయనం చేశారు. ఒకే తరగతి చదువుతున్న పిల్లల్ని రెండు వర్గాలుగా విభిజించారు. వారికి అన్ని అంశాల్లోనూ సమానంగా ఉంచి ఒక్క పచ్చదనం విషయంలోనే వేరు చేశారు. అప్పుడు తరగతి గది కిటికీలోంచి, బయటా పచ్చదనం కనిపించిన పిల్లలు పచ్చదనం కనిపించని పిల్లలకంటే అన్నింటిలోనూ చురుగ్గా ఉండటం గుర్తించారు. భావోద్వేగాలపైనా పచ్చదనం ప్రభావం ఉన్నట్టు గమనించారు.

* పచ్చదనానికి దగ్గరగా ఉన్నవాళ్లు.. ఎక్కువ సంతోషంగా, సానుకూల దృక్పథంతో ఉన్నట్టు మరి కొన్ని అధ్యయనాల్లో గుర్తించారు.

* గతంలోని బాధాకరమైన విషయాల్ని కొందరు గుర్తుచేసుకుంటారు. అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా జరగాల్సింది కాదంటూ చేతుల్లో లేనివాటిని తలచుకుంటారు. చిన్న పార్కు, అడవి ఎక్కడున్నా ప్రకృతి మధ్యలో ఉంటే ఇలాంటి ఆలోచనలు దూరమవుతాయని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పర్యావరణ విభాగం అధ్యయనంలో తేలింది.

* ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వింటేనే కాదు, రాత్రిళ్లు కప్పల బెకబెక అరుపులూ మన మెదడు పనితీరపై ప్రభావం చూపుతాయంటున్నారు. కాబట్టి ఇంటి పనే వ్యాయామం అనుకోకుండా.. వీలుచేసుకుని మరీ మట్టికీ, చెట్లకీ, జంతువులకీ దగ్గరగా ఉంటే శారీరకంగా, మానసికంగా హాయిగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్