మెనోపాజ్‌ దశలో సూపర్‌ఫుడ్స్‌..

నెలసరి నిలిచిన తర్వాత మరింత ప్రత్యేకంగా పోషకాహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ఈ దశలో ఎముకలు బలహీనపడ్డంతోపాటు పలు ఆరోగ్య సమస్యలెదురవుతాయని హెచ్చరిస్తున్నారు..

Published : 01 Jun 2022 01:11 IST

నెలసరి నిలిచిన తర్వాత మరింత ప్రత్యేకంగా పోషకాహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. లేదంటే ఈ దశలో ఎముకలు బలహీనపడ్డంతోపాటు పలు ఆరోగ్య సమస్యలెదురవుతాయని హెచ్చరిస్తున్నారు..

సమస్యలు.. మూడ్‌స్వింగ్స్‌ వచ్చే అవకాశం ఉంది. శరీరం నుంచి వేడి ఆవిర్లు, రాత్రి సమయాల్లో చెమటపట్టి నిద్రకు దూరంకావడం, లైంగిక వాంఛలు తగ్గడం, మూత్రాశయ సంబంధిత సమస్యలు, మతిమరుపు, హృదయ స్పందనలో తేడా, అధికబరువు, ఎముకలు, కండరాలు బలహీనపడటం వంటి సమస్యలెన్నో తలెత్తుతాయి. వీటిని అధిగమించాలంటే పోషకాహారం తప్పనిసరి.

ఆహారం.. కాల్షియం, మెగ్నీషియం, డి విటమిన్‌ పుష్కలంగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, వర్ణభరితమైన కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగు, వెన్న, పాలు వంటివి రోజూ ఆహారంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ తగ్గడంతో ఈ దశలో చెమటెక్కువగా పట్టడం మొదలవుతుంది. దీన్ని సప్లిమెంట్‌గా తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే చేపలు, అవిసె గింజలు, చియా సీడ్స్‌ వంటివి కూడా తీసుకోవడం మంచిది. వీటితోపాటు బ్రోకలి, క్యాలీఫ్లవర్‌, శెనగలు, సోయాబీన్స్‌ వంటివి ఈస్ట్రోజన్‌ స్థాయులను సమన్వయం చేస్తాయి. ఆకుకూరలు, చిక్కుళ్లు, పెరుగు, వెన్న, పాలు, చేపలు, ద్రాక్ష వంటి ముదురువర్ణం ఫలాలు, బ్లాక్‌టీ వంటివన్నీ ఎముకలను ధృడంగా ఉంచుతాయి.

దూరంగా.. ఈ దశలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, వేపుళ్లకు దూరంగా ఉండాలి. అన్నం, పాస్తా, బంగాళాదుంపలు వంటివి రిఫైన్డ్‌ కార్బొహైడ్రేట్లు. వీటిని తీసుకోకూడదు. అలాగే చక్కెరతో చేసే ఆహార పదార్థాలు, కేకులు, క్యాండీల జోలికి వెళ్లకూడదు. ఇవన్నీ అధిక బరువు, మధుమేహం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. బదులుగా దంపుడు బియ్యం, ఉడికించిన శనగలు, మొలకలు వంటివి మంచిది.

నియమాలు.. భోజనం ప్లేటు సగం పండ్లు, ఉడికించిన కూరగాయలతో నిండాలి. ప్రొటీన్లకు ప్రాధాన్యమివ్వాలి. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరి. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ధ్యానం చేయడం అలవరుచుకోవాలి. నిద్రలేమికి దూరంగా ఉంటే చాలు. మెనోపాజ్‌ దశలోనూ ఉత్సాహంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్