ఆల్కలైన్‌ వాటర్‌తో బరువు తగ్గుతామా?

బరువు తగ్గడానికి ఆల్కలైన్‌ వాటర్‌ మంచిదని అంటున్నారు. ఇందుకోసం నిమ్మకాయ నీళ్లు కానీ లేదంటే మార్కెట్లో దొరికే ఆల్కలైన్‌ వాటర్‌ కానీ తాగమని సెలెబ్రిటీలు సలహాలు ఇస్తున్నారు. ఇది నిజమేనా? 

Published : 02 Jun 2022 00:59 IST

బరువు తగ్గడానికి ఆల్కలైన్‌ వాటర్‌ మంచిదని అంటున్నారు. ఇందుకోసం నిమ్మకాయ నీళ్లు కానీ లేదంటే మార్కెట్లో దొరికే ఆల్కలైన్‌ వాటర్‌ కానీ తాగమని సెలెబ్రిటీలు సలహాలు ఇస్తున్నారు. ఇది నిజమేనా? 

ఆల్కలైన్‌ అంటే క్షారగుణం ఉండటం. సాధారణంగా మంచి నీటికి క్షారత్వం, ఆమ్లత్వం రెండూ ఉండవు. తటస్థంగా ఉంటుంది. మరి క్షారగుణం ఉన్న నీటిని తాగమని సలహా ఎందుకు ఇస్తున్నారో చూద్దాం. మాంసాహారం ఎక్కువగా తీసుకుని శాకాహారం తగ్గించడంవల్ల శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. అది తొలగించుకోవడానికి ఆల్కలైన్‌ వాటర్‌ తాగితే మంచిదని నమ్ముతున్నారు. దీంతో క్యాన్సర్‌ రాదనీ చెబుతున్నారు. వాస్తవానికి... మనమే ప్రయత్నమూ చేయకుండానే శరీరం ఈ పనిచేస్తుంది. అంతేకాదు మన ఆహారంలో విదేశాల్లో మాదిరిగా కాకుండా శాకాహారం వాటానే ఎక్కువ. భోజనంలో ఆకుకూరలు, గింజలు, కాయగూరలు సమృద్ధిగా ఉండేట్టు చూసుకుంటే మీరు కోరుకున్నట్టు శరీరంలో క్షారత్వం పెరుగుతుంది. ఇందుకోసం మార్కెట్లో దొరికే ఆల్కలైన్‌ వాటర్‌నే తాగాల్సిన అవసరం లేదు. ఇక నిమ్మకాయ నీళ్లు అంటారా.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకొని తాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలోని విటమిన్‌ సి సహా ఇతర యాంటీఆక్సిడెంట్లు హానికారక ఫ్రీరాడికల్స్‌ని నియంత్రించి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగని కేవలం నిమ్మకాయ నీళ్లతోనే బరువు తగ్గుతారా అంటే... తగ్గరు. మనం ఎంత శక్తిని తీసుకుంటున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్