ఈ సమయంలో శుభ్రత తప్పనిసరి..

నెలసరిలో పరిశుభ్రత పాటించకపోతే పలురకాల చర్మ సమస్యలతోపాటు ప్రమాదకరమైన అనారోగ్యాలూ వస్తాయంటున్నారు నిపుణులు. 

Published : 02 Jun 2022 01:21 IST

నెలసరిలో పరిశుభ్రత పాటించకపోతే పలురకాల చర్మ సమస్యలతోపాటు ప్రమాదకరమైన అనారోగ్యాలూ వస్తాయంటున్నారు నిపుణులు

శానిటరీ న్యాప్‌కిన్స్‌ నాణ్యమైనవి ఎంచుకోకపోతే ఆ ప్రాంతంలో చర్మం అలెర్జీకి గురవుతుంది. త్వరగా తడవడమే కాకుండా ఆ ప్యాడ్‌ కారణంగా పలు అనారోగ్యాలూ వస్తాయి. కొందరు పాత దుస్తులనే ప్యాడ్‌లుగా వినియోగించి, వాటినే తిరిగి శుభ్రం చేస్తుంటారు. అలా వాడిన వస్త్రాన్ని సబ్బుతో ఉతికినా కూడా వేడి నీళ్లలో డెటాల్‌ వేసి నానబెట్టి ఎండలో ఆరబెట్టాలి. లేదంటే ఆ ప్రాంతంలోనే కాకుండా గర్భాశయంలోనూ ఇన్‌ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉంది. ఇది సంతాన సాఫల్యతపైనా ప్రభావాన్ని కలిగిస్తుంది. అందుకే పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి.

మార్చడం.. ప్యాడ్లను నాలుగు నుంచి ఆరుగంటల్లోపు మార్చడం అలవాటు చేసుకోవాలి. రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారు మూడు గంటలకోసారి ప్యాడ్‌ మార్చడం తప్పనిసరి. లేదంటే మూత్రాశయ, గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు సోకడానికి కారణమవుతుంది. ఎక్కువసేపు తేమగా ఉండటంతో అలర్జీలు వస్తాయి. అలాగే ప్యాడ్‌ మార్చిన ప్రతిసారీ ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగని సబ్బు తదితర వాషింగ్‌ లిక్విడ్స్‌ వినియోగించకూడదు. వీటిలోని రసాయనాలు హానిచేస్తాయి. 

ప్యాడ్స్‌ను.. న్యాప్‌కిన్లను మార్చిన తర్వాత వాటిని డిస్పోజ్‌ చేయడంలోనూ జాగ్రత్త పాటించాలి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్