వ్యాయామంతో కుంగుబాటు దూరం

రోజూ క్రమం తప్పక వ్యాయామం చేసేవారిలో కీళ్ల నొప్పులు చాలా అరుదని, కొద్దిమందిలో ఈ సమస్య ఉన్నా తీవ్రత చాలా తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అయిదువేల మందిపై జరిపిన అధ్యయనంలో తేలింది. వ్యాయామంతో కండరాలు బలపడతాయి.

Published : 09 Jun 2022 18:35 IST

రోజూ క్రమం తప్పక వ్యాయామం చేసేవారిలో కీళ్ల నొప్పులు చాలా అరుదని, కొద్దిమందిలో ఈ సమస్య ఉన్నా తీవ్రత చాలా తక్కువని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం అయిదువేల మందిపై జరిపిన అధ్యయనంలో తేలింది. వ్యాయామంతో కండరాలు బలపడతాయి. మోకాళ్లు, మెడ నొప్పులు రావు. కీళ్ల నొప్పులతో ఏళ్ల తరబడి బాధపడే బదులు రోజూ కాసేపు వ్యాయామం చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు. అంతకంటే మంచి సంగతేంటో తెలుసా.. రోజూ నడవటం, పరిగెత్తడం, లేదా ఇతర వ్యాయామం చేసేవారిలో మానసిక దౌర్బల్యాలు తలెత్తవట. యూనివర్సిటీ ఆఫ్‌ గోథెన్‌బర్గ్‌, స్వీడన్‌ దీనికి సంబంధించి క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించింది. యాంగ్జయిటీ, డిప్రెషన్లతో బాధపడుతున్న వారితో పన్నెండు వారాలపాటు వ్యాయామం చేయించినప్పుడు ఆ రుగ్మతలు తగ్గుముఖం పట్టాయట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్