అందానికీ ఆరోగ్యానికీ..

మండే ఎండల్లో మహా రుచికరంగా ఊరిస్తుంది మామిడి పండు. బంగినపల్లి ముక్కలు కోసుకుని తిన్నా, రసాలు జ్యూసు చేసుకుని తాగినా, తోతాపురి, ముంత మామిడి లాంటివి ఉప్పూకారాలు అద్దుకుని తిన్నా.. దేనికదే బహు బాగు. అందుకే మామిడికాయ లేదా పండును

Published : 10 Jun 2022 00:19 IST

మండే ఎండల్లో మహా రుచికరంగా ఊరిస్తుంది మామిడి పండు. బంగినపల్లి ముక్కలు కోసుకుని తిన్నా, రసాలు జ్యూసు చేసుకుని తాగినా, తోతాపురి, ముంత మామిడి లాంటివి ఉప్పూకారాలు అద్దుకుని తిన్నా.. దేనికదే బహు బాగు. అందుకే మామిడికాయ లేదా పండును రోజుకొకటి చొప్పున తినేయండి. ఇవి అందరికీ ఆరోగ్యదాయకమే కానీ స్త్రీలకు మరీ మంచిది. ఎందుకో, ఏమిటో చూద్దాం...

* ప్రపంచవ్యాప్తంగా రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల బారిన పడుతున్న స్త్రీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మామిడిపళ్లు ఈ రకమైన క్యాన్సర్లను నిరోధిస్తాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* కొందరు గర్భిణిలు మలబద్ధకంతో బాధపడుతుంటారు. వాళ్లకిది దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

* నెలసరి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రుతుక్రమం సవ్యంగా రావడంలో తోడ్పడుతుంది. మామిడిపండు పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) తో పోరాడుతుంది. జననాంగాలకు మేలు చేస్తుంది.

* సీజన్‌ అయిపోయేదాకా రోజుకో పండు తిన్నారంటే మీ చర్మం ఆరోగ్యవంతంగా, మృదువుగా తయారై కాంతులీనుతుంది. పండు గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకున్నా ముఖవర్ఛస్సు పెరుగుతుంది.

* ఇది కళ్లకు మంచిది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి చాలారకాల పండ్లు నిషిద్ధం. కానీ ఇది మినహాయింపు. షుగర్‌ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. అన్నిటినీ మించి జ్ఞాపకశక్తినీ ఏకాగ్రతనూ పెంచుతుంది. రోగనిరోధక శక్తినీ పెంచుతుంది.

* విటమిన్లు, ఇనుము, పీచుపదార్థాలూ విస్తారంగా ఉన్నందున మంచి పోషకాహారం. ఒక్కమాటలో చెప్పాలంటే మామిడిపండు అందానికీ ఆరోగ్యానికీ కూడా శ్రేష్ఠమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్