Published : 11/06/2022 01:16 IST

భేషైన డ్రైఫ్రూట్స్‌

బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌ లాంటివి మంచి పోషకాహారమని, నీరసం, నిస్సత్తువ దరికి చేర్చవని మనందరికీ తెలుసు. కానీ వాటితో మరెన్నో లాభాలున్నాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఆక్సిడెంట్లలో ప్యాంక్రియాటిక్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్లను నిరోధించే గుణాలున్నట్లుగా తాజా పరిశోధనల్లో తేలిందంటూ ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌’ పత్రిక ప్రచురించింది. డ్రైఫ్రూట్స్‌తో ముఖానికి నునుపుదనం వస్తుంది. వీటిలో  పిండిపదార్థం తక్కువ ఉన్నందున ఊబకాయం రాదు. టైప్‌ 2 డయాబెటిస్‌ నియంత్రణలో ఉంటుంది. వీటిల్లో ఉండే పాలిఫెనోల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి హృద్రోగాలను నిరోధిస్తాయి. మధుమేహం, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు డ్రైఫ్రూట్స్‌ తినడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. వీటిల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తగినంత మోతాదులో తింటే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని