మెడ నొప్పికి నివారణోపాయం

నలభయ్యేళ్లు దాటిన స్త్రీలలో చాలామంది మెడ, నడుము, తుంటి నొప్పులతో అవస్థ పడటం చూస్తుంటాం. ఇలాంటి సమస్యలుంటే శలభాసనాన్ని ప్రయత్నించి లబ్ధి పొందండి.

Published : 11 Jun 2022 01:17 IST

నలభయ్యేళ్లు దాటిన స్త్రీలలో చాలామంది మెడ, నడుము, తుంటి నొప్పులతో అవస్థ పడటం చూస్తుంటాం. ఇలాంటి సమస్యలుంటే శలభాసనాన్ని ప్రయత్నించి లబ్ధి పొందండి.

ఎలా చేయాలి...
బోర్లా పడుకోవాలి. ఊపిరి మెల్లగా తీసుకుని వదులుతుండాలి. పాదాలను వంచకుండా తిన్నగా ఉంచాలి. బరువును ఎక్కడో ఒకచోట కేంద్రీకరించకుండా శరీరమంతా పరచుకునేట్లు చూడండి.. నుదురు కూడా కింద ఆనించి, రెండు కాళ్లూ దగ్గరగా పెట్టుకోవాలి. రెండు చేతులూ శరీరానికి దగ్గరగా తిన్నగా ఉంచి, అరచేతులను తొడల కింద పెట్టుకోవాలి. ఇప్పుడు మెల్లగా రెండు కాళ్లూ ఒకేసారి పైకి లేపాలి. కాళ్లను ఎంతవరకూ పైకి లేపగలిగితే అంతవరకూ లేపి, పది నుంచి ముప్పై క్షణాల వరకు అలాగే ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా మూడు నుంచి ఆరుసార్లు చేయండి.

ప్రయోజనాలు
ఈ ఆసనం వల్ల నడుం కింది భాగానికి దృఢత్వం చేకూరుతుంది. నడుం నొప్పి రాదు. తొడల కండరాలకు బలం చేకూరుతుంది. తుంటి నొప్పి తగ్గుతుంది. ఈ నొప్పులు లేనివాళ్లు చేస్తే భవిష్యత్తులో రాదు. పొత్తికడుపు వద్ద చేరిన కొవ్వు తగ్గుతుంది. వెన్నెముక దృఢమవుతుంది. కండరాలు బలపడతాయి. మెడ భాగానికి బలం చేకూరి మెడనొప్పి రాదు.

ఎవరు చేయకూడదు?
నడుము, వెన్ను నొప్పులు మరీ ఎక్కువగా ఉన్నవారు, వెన్నెముక చెదిరినవారు శలభాసనం చేయకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్