మజ్జిగతో బరువుకు చెక్‌!

ఎండల్లో నోరూ ఎండుకు పోతుంటుంది. చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది మజ్జిగ. ఇది ఉష్ణతాపాన్ని తగ్గించడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాల్నీ అందిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Updated : 12 Jun 2022 00:25 IST

ఎండల్లో నోరూ ఎండుకు పోతుంటుంది. చల్లచల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది మజ్జిగ. ఇది ఉష్ణతాపాన్ని తగ్గించడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాల్నీ అందిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* దీనిలో ప్రోబయాటిక్స్‌ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి. బరువును తగ్గించడానికీ ఇది బాగా ఉపకరిస్తుంది! పెద్దగ్లాసు మజ్జిగలో 50-80 కెలరీలు మాత్రమే ఉంటాయి. దీనికితోడు నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఫలితంగా చాలాసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కాబట్టి, మళ్లీ తిండి మీదకు మనసు మళ్లదు.
* ఇందులో క్యాల్షియం, ప్రొటీన్‌, బి12 వంటి విటమిన్లు పుష్కలం. ఇవి మనసును, శరీరాన్ని శాంత పరచడమే కాకుండా వడదెబ్బ నుంచీ రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రొటీన్లు ఎముకకు బలాన్ని చేకూరుస్తాయి.
* బరువు తగ్గాలనుకునే వారు భోజనానికి ముందు ఓ చిన్న గ్లాసు మజ్జిగ తాగితే మంచిది. లేదా కడుపు నిండా తినెయ్యకుండా చివర్లో మజ్జిగ తాగినా సరిపోతుంది. మజ్జిగ ఇష్టం లేదంటే స్మూతీలా గానీ, పండ్ల ముక్కలతో కలిపికానీ ప్రయత్నించొచ్చు. ఏదేమైనా ఇంట్లో ప్రతి ఒక్కరూ రోజూ కనీసం ఒక్క గ్లాసు మజ్జిగైనా తాగేలా చూసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్