పాలిచ్చే తల్లులకు పుదీనా!

బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌, కిచిడీల్లో పుదీనా లేకపోవడాన్ని ఊహించలేం కదూ! దీన్ని ఆలుగడ్డ, బీన్స్‌ లాంటి ఏ కూరల్లో వేసినా అదనపు రుచి వస్తుంది. గోంగూర పచ్చడితో పోటీ పడేలా మహత్తరంగా ఉంటుంది పుదీనా చెట్నీ. రంగూ రుచీ వాసనలతో

Published : 13 Jun 2022 01:02 IST

బిర్యానీ, ఫ్రైడ్‌ రైస్‌, కిచిడీల్లో పుదీనా లేకపోవడాన్ని ఊహించలేం కదూ! దీన్ని ఆలుగడ్డ, బీన్స్‌ లాంటి ఏ కూరల్లో వేసినా అదనపు రుచి వస్తుంది. గోంగూర పచ్చడితో పోటీ పడేలా మహత్తరంగా ఉంటుంది పుదీనా చెట్నీ. రంగూ రుచీ వాసనలతో మురిపించడమే కాదండోయ్‌, ఆరోగ్యానికి దోహదం చేసే ఔషధ గుణాలూ ఉన్నాయిందులో. అవేంటో చూస్తే తరచుగా తిందామంటారు...

* పుదీనాలో ఎ-విటమిన్‌, ఐరన్‌, మెగ్నీషియం తదితరాలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం.

* పాలిచ్చే తల్లులకు ఆ భాగంలో నొప్పి కలగడం, చనుమొనలు వాచినట్టుగా ఉండటం, పగుళ్లు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పుదీనా ఆకులను నూరి అక్కడ రాయడం వల్ల ఇలాంటి సమస్యలు తగ్గుతాయి.

* పుదీనాలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం వల్ల సాధారణ జలుబు ఇట్టే తగ్గుతుంది. ఇది నాసల్‌ డ్రాప్స్‌కు ప్రత్యామ్నాయం కాకున్నా జలుబుతో ముక్కు పూడుకుపోయినప్పుడు పుదీనా తైలాన్ని వాసన పీల్చడం ద్వారా తక్షణ ఉపశమనం లభిస్తుంది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది తగ్గుతుంది.

* పుదీనా పరిమళంతో అరోమా థెరపీలు చేస్తున్నారు. దీనితో రూపొందించిన పెప్పర్‌ మింట్‌ ఆయిల్‌ను రోజుకు ఐదు నిమిషాల చొప్పున కొన్నాళ్లు పీల్చడం వల్ల శారీరక ప్రయోజనాలతో బాటు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీనితో మెదడు పనితీరు కూడా మెరుగవుతుందని ఇటీవల జరిపిన అధ్యయనాల్లో తేలింది. దాంతో శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలకు నడుం బిగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్