వంటింట్లో వాటినీ పట్టించుకోండి

ఆరోగ్యం అందిస్తుందంటే బోలెడు ఉత్పత్తుల్ని ప్రయత్నిస్తాం. సహజంగా, మన వంటింట్లో దొరికే వాటిని మాత్రం మర్చిపోతుంటాం. శరీరానికి మేలు చేసే ఆ సూపర్‌

Updated : 16 Jun 2022 04:20 IST

ఆరోగ్యం అందిస్తుందంటే బోలెడు ఉత్పత్తుల్ని ప్రయత్నిస్తాం. సహజంగా, మన వంటింట్లో దొరికే వాటిని మాత్రం మర్చిపోతుంటాం. శరీరానికి మేలు చేసే ఆ సూపర్‌ ఫుడ్స్‌ని ఇప్పటికైనా పట్టించుకోండి!

పల్లీలు.. ఎక్కువ మొత్తంలో ప్రొటీన్‌ వీటి ద్వారా అందుతుంది. గర్భిణులకు అవసరమైన ఫొలేట్‌, బయోటిన్‌లను అందిస్తుంది. విటమిన్‌ ఇ, కాపర్‌, ఫాస్ఫరస్‌ ఉంటాయి. చర్మ సంరక్షణతోపాటు మంచి కొలెస్టరాల్‌ని అందిస్తాయి. జీర్ణసంబంధ సమస్యల్ని పరిష్కరిస్తుంది. రోజూ గుప్పెడు పల్లీలను రోజూ తీసుకోండి.

గుమ్మడి గింజలు.. మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తుంది. పీసీఓడీ సమస్యలకు మంచి మందు. నిద్రలేమితో బాధపడేవారు రోజూ స్పూను తీసుకుంటే సరి. వీటివల్ల ఇంకా ఆరోగ్యమైన కురులు, కొలెస్టరాల్‌ తగ్గడం వంటి లాభాలెన్నో ఉన్నాయి.

పూల్‌ మకనీ.. బరువు తగ్గిస్తాయి. దీనిలోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెజబ్బులను దూరంగా ఉంచుతాయి. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యఛాయల్ని దరిచేరనీయవు.  పొటాషియం, సోడియం ఎక్కువ. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

ఉసిరి.. విటమిన్‌సి గుణాలు ఎక్కువ. ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. ఒత్తిడి, హార్మోన్ల అసమతౌల్యత, నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. రక్తంలో చక్కెరలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గించడం, మెటబాలిజాన్ని మెరుగు పరచడమే కాదు కేశాల పెరుగుదలలోనూ సాయపడుతుంది.

పసుపు.. దీనిలో కుర్‌క్యుమిన్‌ అనే న్యూట్రియంట్‌ ఉంటుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలోనూ, జీర్ణసంబంధ సమస్యలను పరిష్కరించడంలో సాయపడుతుంది. ఆర్థరైటిస్‌, మతి మరుపులను దరిచేరనివ్వదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్