వ్యాయామం.. నాజూకవడానికేనా!

సన్నగా, నాజూకుగా అవ్వడానికే వ్యాయామం అన్న అభిప్రాయం మనలో ముఖ్యంగా గృహిణుల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యపరంగా మరీ అవసరమైతే తప్ప దీని మీద దృష్టి పెట్టరు. కానీ వ్యాయామం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..

Published : 17 Jun 2022 00:59 IST

సన్నగా, నాజూకుగా అవ్వడానికే వ్యాయామం అన్న అభిప్రాయం మనలో ముఖ్యంగా గృహిణుల్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యపరంగా మరీ అవసరమైతే తప్ప దీని మీద దృష్టి పెట్టరు. కానీ వ్యాయామం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..

* వ్యాయామం చేసేప్పుడు గుండె వేగం పెరుగుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ మెదడుకు చేరుతుంది. తద్వారా హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరచడమే కాదు.. మెదడు కణాల అభివృద్ధీ జరుగుతుంది.

* చిన్న చిన్న విషయాలనే మర్చిపోవడం సహజమే. కానీ కొన్నిసార్లు అది సమస్యగానూ మరుతుంటుంది. అందుకే కొద్దిసేపు వ్యాయామానికి కేటాయించండి. ఇది మెదడు కణాల మధ్య బంధాన్ని మెరుగుపరచడమే కాదు. వాటిని ఉత్తేజితం చేస్తుంది. దీంతో విషయం/ సంఘటన ఏదైనా తేలిగ్గా మెమరీలో నిక్షిప్తం అవుతుంది.

* ఆరోజు పనులతో మనకు ఉదయాలు ప్రారంభమవుతాయి. రేపేం చేయాలన్న ఆలోచనతో రోజు ముగుస్తుంది. సమయంలో ఏమాత్రం తేడా వచ్చినా కంగారు. ఇన్ని ఆలోచనలతో సాగుతుంటే నిద్ర మాత్రం ఎలా పడుతుంది? తిరిగి ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వీటన్నింటికీ వ్యాయామమే పరిష్కారం. అందుకే రోజూ కనీసం అరగంటైనా నడక, ఇతర వ్యాయామాలకు చోటివ్వమంటారు నిపుణులు.

* ఒక్కరే చేయడం ఎంతైనా కాస్త విసుగే! ఒంటరిగా నడకా పెద్దగా నచ్చకపోవచ్చు. ఇలాంటప్పుడు మెట్లు ఎక్కి దిగడం, డ్యాన్స్‌, ఈత, టెన్నిస్‌ వంటివీ ప్రయత్నించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్