ఇవి రోజూ తింటే..
సాయంత్రం ఏదైనా తినాలనిపించినప్పుడు నూనెలో వేయించిన చిరుతిళ్లకి బదులుగా కాసిని ఎండుద్రాక్ష ప్రయత్నించండి. వీటినే ఎందుకు తినాలో తెలుసా?
సాయంత్రం ఏదైనా తినాలనిపించినప్పుడు నూనెలో వేయించిన చిరుతిళ్లకి బదులుగా కాసిని ఎండుద్రాక్ష ప్రయత్నించండి. వీటినే ఎందుకు తినాలో తెలుసా?
తక్షణశక్తిని ఇవ్వడమే కాకుండా ఎండుద్రాక్షలు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. కారణం.. వీటిలో పీచు, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎప్పుడో ఒకసారి కాకుండా రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మరీ మంచిది. ఎందుకంటే.. దీనిలోని పీచు మలబద్ధకం రానివ్వదు. శరీరంలో పేరుకున్న మలినాలు, వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది.
ఎండు ద్రాక్షలోని పొటాషియం, మెగ్నీషియం.. శరీరంలో ఆమ్లత్వం పెరగకుండా చూస్తాయి. ఫలితంగా కీళ్లనొప్పులు, గౌట్, గుండె జబ్బుల, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వీటిల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. కాపర్.. రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. బరువు పెరగాలనుకునేవారికి మంచి ఉపాయం ఎండుద్రాక్ష. చెడు కొలెస్ట్రాల్‌ని పెంచకుండా... ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌ల సాయంతో మన బరువుని పెంచుతుంది. చర్మం పొడారిపోయే సమస్య నుంచి కాపాడతాయి. వీటిలో జింక్, విటమిన్సి, సెలీనియంలు ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తాయి. పండ్లతో కలిసి తినొచ్చు. స్మూథీల్లో చేర్చుకోవచ్చు. నానబెట్టి తింటే మరీ మంచిది. అయితే మోతాదుకు మించి మాత్రం తినొద్దు సుమీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!