ఈ మార్పులతో ఆరోగ్యం!

జీవితంలో ఏం సాధించాలన్నా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ఇల్లూ, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు మనలో చాలా మంది. అలాంటివాళ్లు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే కలిగే ప్రయోజనాలెన్నో!

Updated : 01 Jul 2022 05:46 IST

జీవితంలో ఏం సాధించాలన్నా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కానీ ఇల్లూ, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు మనలో చాలా మంది. అలాంటివాళ్లు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే కలిగే ప్రయోజనాలెన్నో!

* కుర్చీకి పరిమితమయ్యే ఉద్యోగులైనా రోజుకు గంట చొప్పున వారంలో మూడు రోజులు బరువులెత్తే వ్యాయామాలు చేస్తే హాయిగా నిద్రపోవచ్చని తాజా అధ్యయనం చెబుతోంది. అంతే సమయంలో సాధారణ వ్యాయామాలు చేసేవాళ్లలో మాత్రం నిద్ర సమస్య పరిష్కారం కాలేదట. బరువులెత్తడం వీలు లేకపోతే రెసిస్టెన్స్‌ బ్యాండ్లతో వ్యాయామాలు చేసినా లాభమేనంటున్నారు నిపుణులు.

* కొవ్వులుండే ఆహారం అధికంగా తీసుకునేవాళ్లు.. అధిక చక్కెర నిల్వలుండే పానీయాలూ తాగితే ‘నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌’ సమస్య వస్తుంది. లివర్‌లో కొవ్వులు అదనంగా చేరడంవల్ల వచ్చే సమస్య ఇది. కాబట్టి చక్కెర లేని పానీయాల్నే ప్రయత్నించండి.

* పెంపుడు జంతువులతో కాలక్షేపం.. ఒత్తిడినీ, రక్తపోటునీ తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితోపాటు వయసుతో వచ్చే మతిమరుపు, కంగారు వంటి సమస్యల్నీ దూరం చేస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది. పెంపుడు జంతువులతో ఉన్నప్పుడు మిగతా విషయాలు మర్చిపోతాం. అలాగే నడవడం, పరిగెత్తడం చేస్తాం. దాంతో శారీరక వ్యాయామమూ. ఇంట్లో పెట్‌ లేని వాళ్లు స్నేహితులతో కబుర్లు చెబుతూ మనసారా నవ్వుకున్నా ఇదే ఫలితం ఉంటుంది. 

* రోజంతా పనిచేసి ఇంటికి చేరడంతోనే కుర్చీలో వాలిపోతారు. అయితే 30-60 ఏళ్ల మధ్య వాళ్లలో వ్యాయామానికి తగినంత సమయం కేటాయించని వాళ్లకి పక్షవాతం ముప్పు ఉందంటోంది ఓ అధ్యయనం. పని దినాల్లో కాకుండా మిగతా రోజుల్లో రోజుకి ఎనిమిది గంటలకంటే ఎక్కువగా కూర్చునే వాళ్లలో రోజులో నాలుగు గంటలకంటే తక్కువ కూర్చునేవాళ్లతో పోల్చితే ఈ ముప్పు నాలుగు రెట్లు ఎక్కువ. కాబట్టి రాత్రి భోజనం తర్వాతా నాలుగు అడుగులు వేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్