పాదాలకు ప్రత్యేక క్రీం..

చినుకుల కాలం మొదలైంది. ఈ సమయంలో పాదాలను ప్రత్యేకంగా సంరక్షించుకోకపోతే పలు ఇన్ఫెక్షన్లబారిన పడతాయి.  వాటి ప్రభావం సుదీర్ఘకాలం బాధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

Updated : 01 Jul 2022 05:43 IST

చినుకుల కాలం మొదలైంది. ఈ సమయంలో పాదాలను ప్రత్యేకంగా సంరక్షించుకోకపోతే పలు ఇన్ఫెక్షన్లబారిన పడతాయి.  వాటి ప్రభావం సుదీర్ఘకాలం బాధించే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఏం జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

దయం, రాత్రి నిద్రపోయే ముందు పాదాలను సబ్బుతో మురికి లేకుండా కడగాలి. ముఖ్యంగా వేళ్లమధ్య పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తడి లేకుండా తుడిచి, మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దనా చేసి మెత్తని పల్చని సాక్సును ధరించి నిద్రపోవాలి. స్విమ్మింగ్‌ లేదా జిమ్‌కు వెళ్లినప్పుడు, స్నానాలగది వద్ద ఇతరులు వినియోగించిన పాదరక్షలను వినియోగించకూడదు. ఒకసారి ధరించిన సాక్సును శుభ్రపరచకుండా తిరిగి వినియోగించకూడదు.
ప్రత్యేక క్రీంతో.. పావుకప్పు చొప్పున షియాబటర్‌, బాదం నూనె, కొబ్బరినూనె, పావుకప్పులో సగం బీ వాక్స్‌, 50 చుక్కల ఆర్గానిక్‌ ఆయిల్‌, 20 చుక్కల చొప్పున పెపర్‌మెంట్‌ ఆయిల్‌, యూకలిప్టస్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ సిద్ధం చేసుకోవాలి. ముందుగా బీవాక్స్‌, బాదంనూనె, కొబ్బరినూనెను ఒక పాత్రలోకి తీసుకొని తక్కువమంటపై మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో వేడిచేయాలి. ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు షియాబటర్‌ వేసి కలుపుతూ, కరిగిన తర్వాత దించేసి చల్లార్చాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో 15 నిమిషాలుంచి తీసేసి, ఇందులో మిగతా నూనెలన్నీ వేసి బ్లెండర్‌తో 5 నిమిషాలు కలపాలి. ఈ క్రీంను పొడిగా ఉన్న గాజుసీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే చాలు. రాత్రి నిద్రపోయే ముందు పాదాలకు ఈ క్రీంతో మృదువుగా మర్దనా చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్లనూ దరిచేరనివ్వదు. ఇందులోని ఫాటీ యాసిడ్స్‌ పాదాలను తేమగా, మృదువుగా మారిస్తే, విటమిన్లు ఏ, ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని నూనెలు దురద, మంట వంటివాటిని దూరం చేస్తాయి. యాంటీసెప్టిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న ఈ క్రీం అలసిన పాదాలకు ఉపశమనాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్