అందం.. ఆరోగ్యానికి వాటర్ థెరపీ
నిండైన ఆరోగ్యం మన సొంతంకావాలంటే పోషకాహారంతోపాటు రోజుకి ఆరేడుగ్లాసుల నీటిని తాగాలని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఆ నీటికి పలురకాల పోషకాలను కలిపి తాగితే అందానికి సంబంధించి మరిన్ని ప్రయోజనాలు మన సొంతమవుతాయట. ఆరు గ్లాసుల నీటికి రెండు చెంచాల జీలకర్ర వేసి పదినిమిషాలు మరిగించి చల్లార్చి తాగితే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, అధికబరువుకు దూరంగా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా...
నిండైన ఆరోగ్యం మన సొంతంకావాలంటే పోషకాహారంతోపాటు రోజుకి ఆరేడుగ్లాసుల నీటిని తాగాలని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఆ నీటికి పలురకాల పోషకాలను కలిపి తాగితే అందానికి సంబంధించి మరిన్ని ప్రయోజనాలు మన సొంతమవుతాయట.
జీలకర్ర.. ఆరు గ్లాసుల నీటికి రెండు చెంచాల జీలకర్ర వేసి పదినిమిషాలు మరిగించి చల్లార్చి తాగితే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, అధికబరువుకు దూరంగా ఉంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా మారుస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నెలసరి సమయంలో కావాల్సిన ఐరన్‌ను అందిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేస్తుంది.
పుదీనా.. లీటరు నీటిలో 15-20 పుదీనా ఆకులను వేసి రాత్రంతా నాననిచ్చి మరుసటి రోజు తాగితే చాలు. ముఖంపై పిగ్మంటేషన్, నల్లని మచ్చలు, కంటి చుట్టూ ఏర్పడే నల్లని వలయాలను దూరం చేస్తుంది. ముఖచర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బరువు సమస్యను దరిచేరనివ్వదు. చర్మం పొడారకుండా పరిరక్షిస్తుంది. శిరోజాలు రాలే సమస్య ఉండదు. ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా ఉండొచ్చు. జీర్ణశక్తిని పెంచుతుంది.
అల్లం.. అయిదారు గ్లాసుల నీటిలో 10 గ్రాముల అల్లాన్ని మెత్తగా చేసి వేసి పావుగంట మరిగించి చల్లార్చి రోజంతా తాగాలి. దీనివల్ల జలుబు, దగ్గు, తలనొప్పి, నెలసరినొప్పి వంటివి దరిచేరవు. అధికబరువు సమస్యను రానివ్వదు. రక్తపోటును సమన్వయం చేయడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయులను పెరగకుండా చూస్తుంది.
తేనె.. గోరువెచ్చని గ్లాసు నీటిలో రెండు చెంచాల ఆర్గానిక్ తేనె కలిపి తాగితే గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు దరిచేరవు. పొత్తికడుపులో కొవ్వును తగ్గిస్తుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తేనెలోని ఫ్రీరాడికల్స్ వృద్ధాప్యఛాయలను త్వరగా దరిచేరనివ్వవు.
సోంపు.. రెండు చెంచాల సోంపును కప్పు వేడినీటిలో పది నిమిషాలు నాననిచ్చి చల్లార్చి తాగాలి. నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం అందుతుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. శిరోజాలు రాలే సమస్య ఉండదు. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. నేత్ర సమస్యలను దరిచేరనివ్వదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!