నడుము నొప్పితో బాధపడుతున్నారా..

పని ఒత్తిడి, కాల్షియం కొరత, బలహీనత- లాంటి కారణాలతో అనేకమంది స్త్రీలు నడుము నొప్పితో బాధపడటం తెలిసిందే. ఈ నడుము నొప్పి, వెన్నెముకలకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా పృష్ణ ముద్ర, బాలాసనం బాగా పనిచేస్తాయి. నడుము నొప్పిని త్వరితంగా తగ్గిస్తుంది కనుక పృష్ణ ముద్రని నడుము నొప్పి ముద్ర అని కూడా అంటారు...

Updated : 02 Jul 2022 08:52 IST

పని ఒత్తిడి, కాల్షియం కొరత, బలహీనత- లాంటి కారణాలతో అనేకమంది స్త్రీలు నడుము నొప్పితో బాధపడటం తెలిసిందే. ఈ నడుము నొప్పి, వెన్నెముకలకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా పృష్ణ ముద్ర, బాలాసనం బాగా పనిచేస్తాయి. నడుము నొప్పిని త్వరితంగా తగ్గిస్తుంది కనుక పృష్ణ ముద్రని నడుము నొప్పి ముద్ర అని కూడా అంటారు.

పృష్ణ ముద్ర

సౌఖ్యంగా ఉండేలా కూర్చోవాలి. రెండు చేతులనూ మోకాళ్ల మీద ఆనించి ఉంచాలి. కుడిచేతి బొటనవేలు అంచున చిటికెన వేలూ, మధ్యవేలూ చివర్లు కలిసి ఉండేలా ఆనించాలి. చూపుడు వేలు, ఉంగరం వేలు తిన్నగా ఉంటాయి. ఎడమ చేతి బొటనవేలును వంచి, చూపుడు వేలును దాని మధ్యలో ఉండేలా పెట్టాలి. మిగిలిన మూడు వేళ్లూ తిన్నగా ఉంటాయి. కళ్లు మూసుకుని మెల్లగా శ్వాస తీసుకుని వదులుతూ దానిమీదే ధ్యాస నిలపాలి. శ్వాస ముక్కు నుంచి నుదురు, నుదుటినుంచి తల, తల వెనుక నుంచి వెన్నెముక భాగానికి.. ఎక్కడ నొప్పి ఉందో అక్కడికి శ్వాస అందిస్తున్నట్టుగా, ఆ నొప్పినంతటినీ శ్వాసతోబాటు బయటకు వదులుతున్నట్టుగా ఊహించుకుంటూ ఈ ముద్ర ఐదు నిమిషాలు చేయాలి. నొప్పి ఎక్కువగా ఉంటే రోజుకు మూడూ నాలుగుసార్లు కూడా చేయొచ్చు. నొప్పి తక్కువవుతున్న కొద్దీ ముద్ర సమయాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ రావాలి. ఈ ముద్ర చేసిన తర్వాత బాలాసనం వేయాలి.


బాలాసనం

బాలాసనాన్ని పర్యాంకాసనం అని కూడా అంటారు. ముందుగా బోర్లా పడుకుని కుడి మోకాలు, కుడి చేతిని పక్కకు మడిచిపెట్టాలి. ఎడమ కాలు, ఎడమ చేయి కిందికి తిన్నగా ఉంచేసి సేద తీరుతున్నట్టుగా పడుకోవాలి. బాగా నడుము నొప్పిగా ఉన్నప్పుడు ఐదు నిమిషాలు ఇలా పడుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎప్పుడు నొప్పి వచ్చినా వెంటనే గనుక రెండు నిమిషాలు కుడివైపు, రెండు నిమిషాలు ఎడమవైపు ఈ భంగిమలో పడుకున్నట్లయితే వెన్నెముక సేదతీరుతుంది. బిగుసుకుపోవడమూ, నొప్పి తగ్గుతాయి. ఈ ముద్ర, ఆసనమూ రెండూ కలిపి చేస్తే ఎంత తీవ్రమైన నడుము నొప్పి, వెన్నెముక సమస్యలైనా తగ్గిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్