యోగా చేస్తున్నది ఏడు శాతమే!

గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవానంతరం ఏడు శాతం మంది మాత్రమే యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సంస్థ ఆధ్వర్యంలో వివాహిత మహిళల్నీ, తల్లులైన వారినీ కలిపి మొత్తం 6,000 మందిపై సర్వే చేపట్టింది.

Published : 04 Jul 2022 00:52 IST

గర్భంతో ఉన్నప్పుడు లేదా ప్రసవానంతరం ఏడు శాతం మంది మాత్రమే యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఓ అధ్యయనం తేల్చి చెప్పింది.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ సంస్థ ఆధ్వర్యంలో వివాహిత మహిళల్నీ, తల్లులైన వారినీ కలిపి మొత్తం 6,000 మందిపై సర్వే చేపట్టింది. ఈమేరకు వివాహమై పిల్లల కోసం ఎదురుచూస్తున్నవారిలో 91 శాతం.. గర్భం దాల్చినప్పుడు, ప్రసవానంతరం యోగా చేయడం ఆరోగ్యకరమైందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే గర్భం దాల్చినప్పుడు, ప్రసవం తర్వాత ఏడు శాతం మంది మాత్రమే యోగా చేస్తున్నట్లు తేలింది. ప్రసవం తర్వాత ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చి యోగా చేయాలని ఉన్నా తమకు తగిన సమయం లేదని 50 శాతం మంది చెప్పగా, 30 శాతం యోగాపై సరైన అవగాహన లేదన్నవారు. అలాగే గర్భం దాల్చినప్పుడు యోగా చేస్తే పుట్టనున్న బిడ్డకు ఏదైనా ఆపద కలుగుతుందేమోనని 26 శాతం మంది భయపడినట్లు చెప్పారు. తల్లి కాకముందు యోగా చేసేవాళ్లలో కూడా ప్రసవం తర్వాత సగం మంది మాత్రమే కొనసాగిస్తున్నారు. అయితే ఫిట్‌నెస్‌ కోసం యోగా చేస్తున్నవారిలో 61 శాతం మంది తాము తల్లి అయిన తర్వాత కూడా దీన్ని కొనసాగిస్తామని చెప్పగా, 16 శాతంమంది ఇది వారిని ప్రసవానంతరం తిరిగి ఆరోగ్యంగా కోలుకునేలా చేస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. తొమ్మిది శాతం మాత్రం యోగా తమను ప్రసవానంతరం కలిగే ఒత్తిడి, ఆందోళన నుంచి దూరం చేస్తుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని