చిన్న అలవాట్లే కానీ...

సాధారణమైన అలవాట్లే కానీ... మన ఫిట్‌నెస్‌ జీవితాన్ని చక్కని మలుపు తిప్పుతాయి. అవేంటో ఓసారి చూసేయండి... ఎన్ని పనులున్నా సరే ఉదయం పూట కేవలం ఓ పావుగంట సమయాన్ని మీ కోసం

Updated : 10 Jul 2022 06:37 IST

సాధారణమైన అలవాట్లే కానీ... మన ఫిట్‌నెస్‌ జీవితాన్ని చక్కని మలుపు తిప్పుతాయి. అవేంటో ఓసారి చూసేయండి...

* ఎన్ని పనులున్నా సరే ఉదయం పూట కేవలం ఓ పావుగంట సమయాన్ని మీ కోసం కేటాయించుకోండి. ఈ సమయం ఏ వ్యాయామం కోసమో కాదు... మంచి అల్పాహారం తినడానికి. అవును... మనం వ్యాయామాలు సునాయాసంగా చేయాలన్నా, రోజంతా చురుగ్గా ఉండాలన్నా శక్తివంతమైన అల్పాహారం తీసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. తిన్న తర్వాతే ఏ పనైనా! మంచి ఫిట్‌నెస్‌కి ఇది మొదటి సూత్రం.

* మంచి నీళ్లు తాగడం అనే అలవాటు గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోతే జరిగే నష్టం చాలా ఎక్కువ. ముఖ్యంగా మానసికంగా దిగులు వెంటాడుతూ ఉంటుంది. అదే తగినన్ని నీళ్లు అందితే శారీరకంగానూ, మానసికంగానూ ఆ మార్పు కనిపిస్తుంది.

* వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌... ఈ మూడింట్లో దేన్నయినా ఎంచుకోండి. కనీసం 30 నిమిషాల సమయాన్ని కేటాయించండి. దీన్నో తప్పనిసరి అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మీ ఫిట్‌నెస్‌లో వచ్చే మార్పులు మీకే తెలుస్తాయి.

* మనకి క్యాల్షియం లోపం గురించి కాస్తయినా అవగాహన ఉంది. కానీ జింక్‌, మెగ్నీషియం గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఎందుకంటే జింక్‌ అందకపోతే వ్యాధినిరోధక శక్తి తగ్గుతుంది. అది లోపిస్తే జుట్టు రాలిపోవడం, యాక్నె వంటి సమస్యలు వస్తాయి. మెగ్నీషియం లోపిస్తే నెలసరిలో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ ఖనిజాలపైనా ఓ కన్నేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్