ఇలా అయితే దృఢంగా...

బరువులెత్తడం మగవాళ్లకు సంబంధించిన వ్యాయామం అనుకుని మహిళలెవరూ అటువైపు చూడనైనా చూడరు. కానీ వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకూ బోల్డెన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. వెయిట్‌లిఫ్టింగ్‌ ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది. తొందరగా అలసటరాదు....

Published : 18 Jul 2022 00:42 IST

బరువులెత్తడం మగవాళ్లకు సంబంధించిన వ్యాయామం అనుకుని మహిళలెవరూ అటువైపు చూడనైనా చూడరు. కానీ వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకూ బోల్డెన్ని ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

వెయిట్‌లిఫ్టింగ్‌ ద్వారా శారీరక దృఢత్వం పెరుగుతుంది. తొందరగా అలసటరాదు.

ముందుకు వంగడం, మోచేతులపైన వాలడం, వస్తువుల్ని లాగడం, నెట్టడం... మొదలైన పనులెంతో సులభంగా చేసుకోగలుగుతారు.

వ్యాయామం తర్వాత కూడా శరీకంలో ఆక్సిజన్‌ వినియోగాన్ని పెంచుతుంది. దానిద్వారా కొవ్వు కరుగుతుంది.

ఎముకల సాంద్రతను పెంచుతుంది. బ్యాలెన్స్‌ పెరిగి జారడం, ఫ్రాక్చర్లు అవ్వడం లాంటివి  తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం పెరిగి, మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

ఎండార్ఫిన్లను విడుదలచేసి రోజంతా చురుగ్గా కదిలేట్టు చేస్తుంది.

వెయిట్‌లిఫ్టింగ్‌ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు అవసరమంటున్నారు

నిపుణులు. అవేంటంటే..

శిక్షకుల సమక్షంలోనే ప్రాక్టీసు చేయాలి. ఎందుకంటే సరైన పద్ధతిలో బరువులెత్తడం చాలా ముఖ్యం.

బరువులు ఎత్తడానికి ముందు స్ట్రెచింగ్‌ వ్యాయామాలు చేయాలి. దీనివల్ల కండరాలు సులభంగా కదులుతాయి.

తేలికపాటి బరువులతో మొదలుపెట్టండి. మధ్య మధ్యలో విరామం ఎక్కువగా తీసుకోండి. వారంలో రెండు రోజులు వీటికి దూరంగా ఉండండి.

నెమ్మదిగా, ఓపిగ్గా ఎక్కువ రోజులు శ్రమిస్తే మంచి శరీరాకృతి వస్తుంది.

బరువులెత్తితే మగవాళ్లలా కండలు వస్తాయనుకోకండి. టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ కారణంగా వాళ్లకి కండలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో అనుమానం అక్కర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్