నాలుగు పదుల్లోనూ యవ్వనంగా
లావణ్యకు పక్కింటామెను చూస్తే అసూయ. పాతికేళ్లు కూడా నిండని తనకు ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటే, నలభై ఏళ్లు దాటిన ఆమె ముఖం మాత్రం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది. దీనికి తీసుకునే ఆహారం కూడా కారణమంటున్నారు నిపుణులు.
లావణ్యకు పక్కింటామెను చూస్తే అసూయ. పాతికేళ్లు కూడా నిండని తనకు ముఖంపై ముడతలు, గీతలు వస్తుంటే, నలభై ఏళ్లు దాటిన ఆమె ముఖం మాత్రం మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుంది. దీనికి తీసుకునే ఆహారం కూడా కారణమంటున్నారు నిపుణులు.
వృద్ధాప్య ఛాయల్ని అడ్డుకోవాలంటే ప్రత్యేకంగా కొన్నిరకాల ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు, విటమిన్లు, ఖనిజలవణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, వయసు పైబడిన సంకేతాలను దరికి చేరనీయవు. గింజ ధాన్యాలు, గోధుమ, బ్రౌన్‌రైస్, గుడ్లు, తాజా కూరగాయలు, విత్తనాలు, తాజా పండ్లు వంటివి శరీరాన్ని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, మెదడుపైనా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి.
కుర్‌క్యుమిన్.. ఇందులోని యాంటీఆక్సిడెంట్ గుణాలు కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. ఎప్పటికప్పుడు కొత్త కణాలు ఏర్పడి ముఖచర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి. వంటకాల్లో పసుపు వాడకాన్ని పెంచాలి. అలాగే రోజూ గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. ఇందులోని పాలీఫినాల్ కాంపౌండ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వయసు పైబడుతున్నట్లుగా ముఖంలో వచ్చే ముడతలను త్వరగా దరిచేరనివ్వదు.
వేరుశనగ.. ఈ పప్పులో ఉండే రెస్వెరట్రాల్ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి చర్మాన్ని తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ తరహా ఎంజైమ్ ద్రాక్ష, బ్లూబెర్రీస్, కొకోవా, డార్క్ చాక్లెట్‌లోనూ లభ్యమవుతుంది. వీటికి రోజూ మెనూలో చోటిస్తే చాలు. మెరిసే ముఖం సొంత మవుతుంది. టొమాటోలోని లైకోపిన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కణజాలాన్ని ఉత్తేజ పరుస్తుంది. పుచ్చకాయ, పింక్ గ్రేప్స్‌లోనూ లైకోపిన్ ఉంటుంది. అందుకే రోజూ తినే వాటిలో వీటికి చోటివ్వండి... మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.