వెచ్చటి నీళ్లు - మాయాజాలం
మనకు పోషకాహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే. ఇతర కాలాల్లో మామూలు నీళ్లే తాగినా.. ఎండాకాలం చల్లటి నీటితో సేదతీరుతాం. ఏ కాలంలోనైనా రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగమని, అవి గోరువెచ్చగా ఉంటే మరింత శ్రేష్ఠమని హితవు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
మనకు పోషకాహారం ఎంత అవసరమో నీళ్లు కూడా అంతే. ఇతర కాలాల్లో మామూలు నీళ్లే తాగినా.. ఎండాకాలం చల్లటి నీటితో సేదతీరుతాం. ఏ కాలంలోనైనా రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగమని, అవి గోరువెచ్చగా ఉంటే మరింత శ్రేష్ఠమని హితవు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇదెంత ప్రయోజనమో ఇల్లాలికి అర్థమైతే.. ఇక ఇంటిల్లిపాదీ వెచ్చటి నీళ్లు తాగేలా చూడటం తథ్యం
* నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగూ అలసటా తగ్గుతాయి. మొటిమలు రావు. చుండ్రు రాదు. జుట్టు రాలదు, కుదుళ్లు బలపడతాయి. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.
* కొందరికి ముఖంలో ముడతలు వచ్చి ఎక్కువ వయసు వారిలా కనిపిస్తుంటారు. ఉదయాన్నే రెండు గ్లాసుల వెచ్చటి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే అనేక ప్రయోజనాలుంటాయి.
* పరగడుపున.. అదీ ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగడం మంచిది. అలాంటప్పుడు నీళ్లు గోరువెచ్చగా ఉంటే సహించకపోవడం లాంటి ఇబ్బంది లేకుండా సులువుగా తాగేయొచ్చు.
* వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే బద్ధకం తగ్గి ఉల్లాసంగా ఉంటుంది. శరీరం వేడి పుంజుకుంటుంది. ముక్కు దిబ్బడ, గొంతు పూడుకు పోవడం, మాటలో జీర, శ్వాస ఇబ్బందులు నయమవుతాయి. చలి, వణుకు లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.
* వెచ్చటి నీళ్లతో అవయవాలన్నీ ఉత్తేజితమవుతాయి. కండరాలు బిగుసుకుపోవు. జీర్ణప్రక్రియను వృద్ధిచేసి మలబద్ధక సమస్యను నివారిస్తాయి.
* నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలన్నీ వెళ్లిపోతాయి.
* శరీరం పొడిబారదు. ముఖం కాంతిమంతంగా ఉంటుంది. అన్నిటినీ మించి ఒత్తిడి, ఆందోళనల స్థాయి తగ్గుతుంది. అందుకే నీళ్లే కదాని నిర్లక్ష్యం చేయొద్దు!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.