నెలలో నాజూకు నడుము!

చాలామంది తమకు పిరుదులు, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉందని బాధపడుతుంటారు. అలా అదనంగా ఉన్న ఫ్యాట్‌ తగ్గాలంటే వీటిని పాటించండి... రెండు కాళ్లూ దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. పక్కన చేతులను ఆసరాగా పెట్టుకోవాలి. పాదాలను పైకి లేపాలి. పిరుదుల మీదే బలం మోపుతూ మోకాళ్లను కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి చొప్పున...

Published : 06 Aug 2022 00:49 IST

చాలామంది తమకు పిరుదులు, నడుము దగ్గర కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉందని బాధపడుతుంటారు. అలా అదనంగా ఉన్న ఫ్యాట్‌ తగ్గాలంటే వీటిని పాటించండి...

1 రెండు కాళ్లూ దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. పక్కన చేతులను ఆసరాగా పెట్టుకోవాలి. పాదాలను పైకి లేపాలి. పిరుదుల మీదే బలం మోపుతూ మోకాళ్లను కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి చొప్పున తిప్పుతుండాలి. పాదాలను మాత్రం కింద పెట్టకూడదు. ఇలా పది లేదా ఇరవైసార్లు చేసి, కాస్త ఆగి మళ్లీ చేయాలి.


2 బోర్లా పడుకోవాలి. రెండు చేతులూ ఛాతీకి దగ్గరగా కలిపి పెట్టి (చేతులు కట్టుకున్నట్టుగా) ఉంచాలి. రెండు కాళ్లూ పైకి మడవాలి. మెల్లగా కాళ్లను, నడుమును మాత్రమే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పుతుండాలి. నేలమీద ఆనించిన మోచేతుల మీద బరువు ఉంటుంది. 20 సార్లు చేసి ఆగి మళ్లీ చేయాలి. అలా 40 లేదా 60 సార్లు చేయాలి.


3 వెల్లకిల పడుకోవాలి. రెండు కాళ్లూ మడిచి, రెండు చేతులూ దగ్గరగా పెట్టుకుని మెల్లగా నడుమును, పిరుదులను వీలైనంత పైకి లేపాలి. తల కదిలించకూడదు. శ్వాస తీసుకుంటూ పిరుదులను పైకి, శ్వాస వదులుతూ కిందికి... ఇలా పదిసార్లు చేసి ఆగి మళ్లీ చేయాలి. మొత్తం 30 సార్లు చేయాలి.


ఇవి సత్వర ఫలితాన్నిస్తాయి. ఈ మూడూ కనుక చేశారంటే 30 రోజులు తిరక్కుండానే నడుము, పిరుదుల చుట్టూ పేరుకున్న కొవ్వంతా తగ్గిపోతుంది.  వీటిని కాస్త నడుము నొప్పి ఉన్నవాళ్లు చేయొచ్చు. కానీ వెన్నెముక సమస్యలు తీవ్రంగా ఉంటే మాత్రం చేయకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్