రోగనిరోధకత పెంచేద్దాం!

పిల్ల, పెద్ద తేడా లేకుండా జలుబులు, వైరల్‌ జ్వరాలు. వీటి నుంచి ఇంట్లో వాళ్లని ఎలా కాపాడాలా అని దిగులు పడుతున్నారా?గానుగ పట్టిన కొబ్బరి నూనెను రోజూ రెండు టేబుల్‌స్పూన్లు ఇవ్వండి.

Published : 12 Aug 2022 01:29 IST

పిల్ల, పెద్ద తేడా లేకుండా జలుబులు, వైరల్‌ జ్వరాలు. వీటి నుంచి ఇంట్లో వాళ్లని ఎలా కాపాడాలా అని దిగులు పడుతున్నారా?

* గానుగ పట్టిన కొబ్బరి నూనెను రోజూ రెండు టేబుల్‌స్పూన్లు ఇవ్వండి. దీనిలో లారిక్‌, కాప్రిలిక్‌, కాప్రిక్‌ యాసిడ్లు ఉంటాయి. ఇవి వైరస్‌లకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఈ నూనె రోగ నిరోధకతను పెంచడంతో పాటు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బరువునూ అదుపులో ఉంచుతుంది.

* గుమ్మడి, క్యాప్సికం, క్యారెట్‌, టొమాటో, బొప్పాయి.. ఇలా భిన్న వర్ణాల కూరగాయలకు ప్రాధాన్యమివ్వాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, రోగనిరోధకతను పెంచుతాయి.

* విటమిన్‌ సి అధికంగా ఉండే నారింజ, బత్తాయి, నిమ్మ, కివి, బెర్రీలతోపాటు ఆకు కూరలు, మొలకలనూ తినాలి. ఉసిరిని ఏదో రూపంలో రోజూ తీసుకుంటే దానిలోని యాంటీ వైరల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు రోగాల బారిన పడకుండా కాపాడతాయి.

* ఉదయాన్నే మోరింగా గ్రీన్‌ టీని తాగండి. దీనిలో విటమిన్లు, మినరల్స్‌ అధికం. ఇమ్యూనిటీ పెరగడమే కాదు.. ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరచి బరువునీ అదుపులో ఉంచుతుంది. టీ నచ్చని వారు గ్రీన్‌ కాఫీ తీసుకున్నా మంచిదే.

* కూరల్లో వెల్లుల్లి, మిర్చి, మిరియాలు, అల్లం, ఇంగువ, పసుపు, జీలకర్ర, కొత్తిమీరలను దట్టించండి. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూడటంతోపాటు సూక్ష్మజీవుల నుంచీ కాపాడతాయి. జింక్‌ ఎక్కువగా ఉండే నట్స్‌, పప్పులు, పాల ఉత్పత్తులూ రోగనిరోధకతను పెంచేవే.

* బీట్‌రూట్‌, క్యారెట్‌, పాలకూర, ఉసిరి, అల్లం, నిమ్మ వంటి వాటిని కలిపి జ్యూస్‌లా ఉదయాన్నే తాగి చూడండి. శరీరానికి కావాల్సిన శక్తినివ్వడంతోపాటు జబ్బులు రాకుండానూ కాపాడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్