ఆందోళనా? ఈ ఆసనం వేయండి

మనకు అనేక సందర్భాల్లో తలనొప్పి వస్తుంటుంది. ఒక్కోసారి మనసంతా దిగులూ దుఃఖం ఆవరించినట్లుగా అలసటగా, అశాంతిగా ఉంటుంది. దీని నుంచి బయటపడేందుకు పశ్చిమోత్థాసనం వేసి చూడండి. ఇది అనేక శారీరక సమస్యలను నివారించడంతో పాటు మానసిక ఆందోళన నుంచి కూడా విముక్తుల్ని చేస్తుంది.

Updated : 15 Aug 2022 15:27 IST

మనకు అనేక సందర్భాల్లో తలనొప్పి వస్తుంటుంది. ఒక్కోసారి మనసంతా దిగులూ దుఃఖం ఆవరించినట్లుగా అలసటగా, అశాంతిగా ఉంటుంది. దీని నుంచి బయటపడేందుకు పశ్చిమోత్థాసనం వేసి చూడండి. ఇది అనేక శారీరక సమస్యలను నివారించడంతో పాటు మానసిక ఆందోళన నుంచి కూడా విముక్తుల్ని చేస్తుంది.

ఎలా చేయాలి...

కాళ్లు ముందుకు చాపి కూర్చోవాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ చేతులను పైకి లేపాలి. శ్వాస వదులుతూ ముందుకు వంగి తలను కాళ్ల మీద ఆనించి చేతులతో పాదాలను పట్టుకోవాలి. కష్టమనిపిస్తే వెన్నును వంచగలిగినంత వరకే వంచండి. కొన్ని రోజుల తర్వాత పొట్ట, ఉదర భాగం కాళ్లకు తాకేలా వంగుతుంది. కిందికి వంగినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుని 20 లేదా 30 సెకన్లు ఆపి ఉంచాలి. మెల్లగా శ్వాస వదులుతూ తలను పైకి లేపాలి. ఇలా మూడు సార్లు చేయాలి. అన్ని ఆసనాల్లాగే ఇది కూడా ఖాళీ కడుపుతో చేయాలి. ఉదయాన్నే వీలవ్వకపోతే మూడు గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు చేయొచ్చు.

ప్రయోజనాలు

ఈ ఆసనంతో వెన్నెముక, భుజాలు, పొత్తికడుపు, తొడ భాగాలు బలం పుంజుకుంటాయి. జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఊబకాయం తగ్గుతుంది. తలనొప్పి, యాంగ్జయిటీ, డిప్రెషన్‌ల నుంచి ఉపశమనం కలుగుతుంది. నెలసరిలో సమస్యలు తగ్గుతాయి. నిద్రలేమికీ మంచిది.

ఎవరు చేయకూడదు...

ఉబ్బసంతో బాధపడుతున్న వారు ఈ ఆసనం చేయకూడదు. ఏదైనా అనారోగ్యం ఉన్న రోజుల్లో చేయకూడదు. వెన్ను సంబంధ సమస్యలున్న వారు యోగా శిక్షకుల నేతృత్వంలోనే చేయాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్