హాయిగా నిద్రపోండిలా!

ఆరోగ్యమయ జీవితానికి రోజూ ఏడు గంటల నాణ్యమైన నిద్ర అవసరమని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అన్ని గంటలు మంచంపైనే ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టని వాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లు ఈ నియమాలు పాటిస్తే మార్పు ఉంటుంది.

Published : 14 Aug 2022 01:57 IST

ఆరోగ్యమయ జీవితానికి రోజూ ఏడు గంటల నాణ్యమైన నిద్ర అవసరమని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కానీ అన్ని గంటలు మంచంపైనే ఉన్నా, నిద్ర సరిగ్గా పట్టని వాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లు ఈ నియమాలు పాటిస్తే మార్పు ఉంటుంది.

20 నిమిషాల కాంతి...

సూర్యోదయానికిముందే మేల్కొనడం మంచి అలవాటని పెద్దలు చెబుతారు. అది ఊరికే చెప్పింది కాదు, అందులో శాస్త్రీయత ఉంది. శరీరానికి తగినంత ఎండ తగిలితే 14 గంటల తర్వాత చక్కగా నిద్ర పడుతుందట. అందుకే పొద్దున్న ఎంత సేపు ఎండలో ఉంటే అంత మంచిది. నీరెండలో నడవడం, ఎండ తగిలే చోట బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం, ఎండ తగిలే కిటికీ దగ్గర ఉండటం... ఇలా ఏదో ఒక రూపంలో కనీసం 20 నిమిషాలు ఎండ పడేలా చూసుకోవడం ముఖ్యం.

30 గ్రాముల ఫైబర్‌...

సరైన మోతాదులో ఫైబర్‌ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. నిద్రలో గాఢత సమయాన్నీ పెంచుతుంది. విశ్రాంతి, అలసట తీరి నూతనోత్తేజంతో తర్వాత రోజును ప్రారంభించాలంటే ఇది అవసరం. ఓట్స్‌, పప్పులు, పండ్లు, కూరగాయల ద్వారా ఫైబర్‌ని తగినంత తీసుకోవాలి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే ఇంకా మంచిది.

6 నిమిషాల చదువు..

నిద్రలేమి కారణాల్లో ఒత్తిడి ప్రధానమైనది. నిద్ర పోవడానికి ముందు కనీసం ఆరు నిమిషాలు చదివితే.. 68 శాతం ఒత్తిడి తగ్గుతుంది.

25 డిగ్రీల ఉష్ణోగ్రత...

సాయంత్రానికి శరీర ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. కాబట్టి బెడ్‌రూమ్‌లోనూ కాస్త చల్లగా ఉండటం ముఖ్యం. 25-26 డిగ్రీల వాతావరణంలో నిద్ర బాగా పడుతుంది.

10 నిమిషాల సంగీతం..

వర్షం, పక్షుల కిలకిలలు, చెట్ల కదలికల్లాంటి ఆహ్లాదకరమైన సంగీతం వింటే.. మనసు తేలికవుతుంది. ఇవి మెదడుని ప్రశాంతంగా ఉంచుతాయి. నిద్రకు ముందు పది నిమిషాలపాటు వీటిని వినాలి. రాగ యుక్తంగా ఉండే వేద మంత్రాలు విన్నా ఇలాంటి ప్రభావం ఉంటుంది.

5 నిమిషాల శ్వాస

అయిదు నిమిషాలు దీర్ఘశ్వాస తీస్తూ, నెమ్మదిగా గాలిని వదులుతూ యోగా చేసినా మెదడుకు విశ్రాంతి దొరకుతుంది. ఇదే సమయంలో గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి, టెన్షన్‌ లేకుండా నిద్రకు సిద్ధం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్