వెనిగర్‌ని రోజూ తీసుకుంటే..

ముఖంపై యాక్నె తగ్గడం లేదు... పీసీఓస్‌ వేధిస్తోంది. బరువు తగ్గే దారేలేదా? ఈ సమస్యలకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంది యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ రూపంలో. అదెలానో తెలుసుకోవాలని ఉందా?...

Updated : 16 Aug 2022 09:03 IST

ముఖంపై యాక్నె తగ్గడం లేదు... పీసీఓస్‌ వేధిస్తోంది. బరువు తగ్గే దారేలేదా? ఈ సమస్యలకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంది యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ రూపంలో. అదెలానో తెలుసుకోవాలని ఉందా?...

* పీసీఓఎస్‌ సమస్యతో బాధపడుతున్నారా? అయితే రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ని కలిపి తాగి చూడండి. ఇది హార్మోన్‌ సమస్యల్ని నియంత్రిస్తుంది. నెలసరులు క్రమంగా రావడానికి సహకరిస్తుంది. మెనోపాజ్‌, ప్రీమెనుస్ట్రువల్‌ సమస్యల నుంచీ యాపిల్‌ సిడర్‌ ఉపశమనాన్ని ఇస్తుంది.

* బరువు తగ్గాలా? అయితే ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ని తీసుకోండి అంటున్నారు నిపుణులు. ఎన్నో అధ్యయనాలూ దీన్ని రుజువు చేశాయి. ఆహారం లేదా నీటిలో కలుపుకొని ఈ వెనిగర్‌ని తీసుకుంటే చాలాసేపటి వరకూ ఆకలి అనిపించదట. దీంతో తీసుకునే కేలరీల సంఖ్యా తగ్గుతుంది. అలా బరువు తగ్గడానికి కారణమవుతుంది.

* చర్మం పొడిబారడం, ఎగ్జిమా వంటి సమస్యలున్న వారికి ఈ వెనిగర్‌ మంచి ప్రత్యామ్నాయమట. యాక్నేకి వ్యతిరేకంగానూ పోరాడుతుంది.

* దీనిలో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ. అందుకే దీన్ని ఆహారాన్ని నిల్వ చేయడంలో ఎక్కువగా వాడతారు. దీన్ని రోజూ తీసుకుంటే సూక్ష్మక్రిములతో పోరాడి, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ సమస్యల్నీ దూరంగా ఉంచుతుంది.

* రక్తంలో చక్కెరల స్థాయిని క్రమబద్ధం చేయడంలో సాయపడుతుంది. అందుకే మధుమేహులనీ దీన్ని రోజూ తీసుకోమంటారు.

* జీర్ణక్రియ సాఫీగా సాగితేనే ఎవరైనా ఆరోగ్యంగా ఉండగలిగేది. జీర్ణ సంబంధిత సమస్యలకూ ఇది చెక్‌ చెప్పగలదు. అజీర్తి, మల బద్ధకం, గ్యాస్‌ పట్టేయడం లాంటివి అనిపిస్తే ఓ గ్లాసులో టేబుల్‌ స్పూను ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలుపుకొని తాగి చూడండి. వెంటనే సమస్య దూరమవుతుంది.

రోజూ ఉదయాన్నే గ్లాసు నీటికి 1-2 టేబుల్‌ స్పూన్ల ఆపిల్‌ సిడార్‌ కలిపి తీసుకోవడం అలవాటు చేసుకోండి. అయితే సేంద్రియ పద్ధతిలో రూపొందించిన వెనిగర్‌ తీసుకుంటేనే ప్రయోజనకరం. అందుకే కొనే ముందు దీన్ని సరి చూసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్