కొత్తిమీర కమ్మదనం

వంటల్లో కొత్తిమీర కనుక లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది కదూ! కూర, చారు, పచ్చడి.. ప్రతిదాంట్లో వేసి ఘుమఘుమలు తెప్పిస్తాం మరి. రుచికి అంత సుమధురం మరి. అంతేనా.. ఆరోగ్యానికీ మంచిదండోయ్‌! స్త్రీలకు వచ్చే అనేక సాధారణ అనారోగ్యాలకు కొత్తిమీరతో చెక్‌ పెట్టొచ్చంటే అతిశయోక్తి కాదు.

Published : 21 Aug 2022 01:04 IST

వంటల్లో కొత్తిమీర కనుక లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది కదూ! కూర, చారు, పచ్చడి.. ప్రతిదాంట్లో వేసి ఘుమఘుమలు తెప్పిస్తాం మరి. రుచికి అంత సుమధురం మరి. అంతేనా.. ఆరోగ్యానికీ మంచిదండోయ్‌! స్త్రీలకు వచ్చే అనేక సాధారణ అనారోగ్యాలకు కొత్తిమీరతో చెక్‌ పెట్టొచ్చంటే అతిశయోక్తి కాదు.

* నాసికకు ఆహ్లాదం కలిగించి జిహ్వకు వహ్వా అనిపించే పదార్థాల వల్ల శరీరానికి అవసరమైన ఎంజైమ్స్‌ చక్కగా ఊరతాయి. దాంతోనే సగం ఆరోగ్యం చేకూరుతుంది. ఆ పని మహత్తరంగా చేస్తుంది కొత్తిమీర.

* ఇందులో విటమిన్‌-కె విస్తారంగా ఉన్నందున రక్తం గడ్డ కట్టదు. ఆస్టియోపొరాసిస్‌ లాంటి వ్యాధులు రావు. ఎముకలను సురక్షితంగా ఉంచడమే కాకుండా మతిమరపును దూరం చేస్తుంది.

* ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీఆక్సిడెంట్లు మెటబాలిజంను క్రమబద్ధం చేస్తాయి. ఇందులో యాంటీ క్యాన్సర్‌ గుణాలూ ఉన్నాయి.

* ఇది నరాల వ్యవస్థను, లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులకు మంచిది. కిడ్నీ స్టోన్స్‌ను నివారిస్తుంది. నోటిపూత రానివ్వదు. ఇందులోని విటమిన్లు, ఐరన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తసరఫరా సవ్యంగా ఉండేలా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను(ఎల్‌డీఎల్‌) తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను(హెచ్‌డీఎల్‌) పెంచుతుంది. దాంతో హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.

* కొత్తిమీరలో ఉన్న ఎ-విటమిన్‌ కళ్లకు మేలుచేస్తే, సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్‌ కళ్ల కింద నలుపును పోగొడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

* కొత్తిమీరలో ఉన్న క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరంలు దంతాలు, ఎములకను దృఢంగా ఉంచుతాయి. ఇది రక్తంలో చెక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు రోజూ కొన్ని ఆకులు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీళ్లజబ్బులు తగ్గుముఖం పడతాయి.

* ఇందులో ఉన్న పీచు జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. కడుపుబ్బరం, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. పేగులు శుభ్రంగా ఉండటంతో చిత్తం (మూడ్‌) బాగుంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్