అమ్మాయిల అందానికీ.. గర్భిణుల ఆరోగ్యానికీ!
ఈతరం అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తోన్న సమస్య.. హార్మోనుల్లో అసమతుల్యత. దీనికి పొద్దుతిరుగుడు విత్తనాలతో చెక్ చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ఇదేకాదు కొవ్వును తగ్గించడం, అందాన్ని సంరక్షించడం.. ఇంకా ఎన్నో రకాలుగానూ ఇవి సాయపడతాయి.
ఈతరం అమ్మాయిల్లో ఎక్కువగా కనిపిస్తోన్న సమస్య.. హార్మోనుల్లో అసమతుల్యత. దీనికి పొద్దుతిరుగుడు విత్తనాలతో చెక్ చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ఇదేకాదు కొవ్వును తగ్గించడం, అందాన్ని సంరక్షించడం.. ఇంకా ఎన్నో రకాలుగానూ ఇవి సాయపడతాయి.
* వీటిల్లో విటమిన్ ఇ, సెలెనియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చర్మకణాలను రిపేర్ చేయడంలో సాయపడతాయి. విటమిన్ ఇ లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయల్ని దరిచేరన్వివవు. యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ అందించి, మెరిసేలా చేస్తాయి.
* ఈ విత్తనాల్లో 100 భిన్న రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి హార్మోనుల్లో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. గర్భిణుల్లో కనిపించే థైరాయిడ్, మార్నింగ్ సిక్నెస్ వంటివాటినీ దూరంగా ఉంచుతాయి. పుట్టబోయే పిల్లల్లో మెదడు, వెన్నెముక సమస్యలు రాకుండా చూస్తాయట. ఫోలిక్ ఆసిడ్ రక్తహీనతను రాకుండా చూస్తుంది.
* వేళలకు తినకపోవడం, జంక్ ఫుడ్‌కు ఆకర్షితులవడం కూడా అధిక బరువుకు కారణమవుతాయి. దాని వల్ల వచ్చే చెడు కొలెస్టరాల్‌ను పొద్దు తిరుగుడు విత్తనాలు తగ్గిస్తాయి. ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా అనిపించి, త్వరగా ఆకలవ్వనివ్వవు. అంతేకాదు శరీరంలో విషపూరిత పదార్థాలను బయటకు వెళ్లగొడతాయి. వీటిల్లోని మెగ్నీషియం గుండె జబ్బుల్నీ దరిచేరనివ్వదు.
* పొద్దుతిరుగుడులో ఫ్లావనాయిడ్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి రోగనిరోధకతను పెంచి, త్వరగా జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయి. దీనిలో యాంటీ డయాబెటిక్, కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. మధుమేహం, రక్తపోటు, అల్జీమర్స్‌నీ దరి చేరనివ్వవు. దీనిలోని మెగ్నీషియం జీర్ణ ప్రక్రియతోపాటు మెదడు, ఎముకల ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!