తలనొప్పిని తరిమేయండి!

నిద్రలేమి, పిల్లల కోసమంటూ మధ్యలో లేస్తుండటం, ఉద్యోగినులైతే అదనంగా తెర సమయం, కనిపించని ఒత్తిడి.. ఎన్ని కారణాలో తలనొప్పికి! అందుకే మనలో చాలామందిలో ఈ సమస్య తరచూ కనిపిస్తుంటుంది. త్వరగా తగ్గించుకోవాలా? ఈ చిట్కాలు ప్రయత్నించేయండి.

Published : 23 Aug 2022 00:26 IST

నిద్రలేమి, పిల్లల కోసమంటూ మధ్యలో లేస్తుండటం, ఉద్యోగినులైతే అదనంగా తెర సమయం, కనిపించని ఒత్తిడి.. ఎన్ని కారణాలో తలనొప్పికి! అందుకే మనలో చాలామందిలో ఈ సమస్య తరచూ కనిపిస్తుంటుంది. త్వరగా తగ్గించుకోవాలా? ఈ చిట్కాలు ప్రయత్నించేయండి.

* పనిలో బాగా నిమగ్నమైతే కళ్లు రెప్పకొట్టడం మర్చిపోతుంటాం. ముఖ్యంగా స్క్రీన్‌ని చూసేప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కళ్లు పొడిబారి తలనొప్పికి దారితీస్తాయి. కళ్లు మూసుకొని కనుగుడ్లను గుండ్రంగా క్లాక్‌, యాంటీ క్లాక్‌ పద్ధతిలో తిప్పాలి. తర్వాత రెంటినీ ఒక దగ్గరికి తీసుకురావడం నలుమూలలకీ తీసుకెళ్లడం లాంటి వ్యాయామాలు చేస్తే త్వరగా ఉపశమనం ఉంటుంది.

* కళ్లు మూసుకుని నుదుటి మీద నుంచి పక్కల వరకు మృదువుగా మసాజ్‌ చేసుకుంటే సరి. మజిల్‌ టెన్షన్‌ వల్ల వచ్చిందైతే ఈ మర్దనాతో దూరమవుతుంది.

* చాలాసార్లు వేడివేడి టీ లేదా కాఫీ తాగుతుంటాం కదా! ఏదైనా చల్లటి వస్తువునో, చన్నీటిలో ముంచి తీసిన కర్చీఫ్‌నో నుదుటి మీద పెట్టుకొని అలా కొద్దిసేపు కళ్లు మూసుకోండి. దెబ్బకు నొప్పి దూరమవుతుంది. బియ్యాన్ని వస్త్రంలో చుట్టి వేడి చేసి కాపడంలా పెట్టుకున్నా ఫలితం ఉంటుంది.

* సువాసనలూ కొన్నిసార్లు తలనొప్పిని దూరం చేస్తాయి. నొప్పి అనిపించినప్పుడు వాటి వాసన చూస్తే ఒత్తిడి దూరమై ఉపశమనం కలుగుతుంది. అల్లం లేదా చామంతి వంటి పూల టీలను తాగినా త్వరిత ప్రయోజనం కలుగుతుంది.

* ఒంట్లో నీటిశాతం తగ్గినా ఈ సమస్యకు దారితీస్తుందట. అలాంటప్పుడు కొబ్బరినీళ్లు కానీ గ్లూకోజ్‌ కలిపిన నీళ్లను కానీ తాగిచూడండి. పనిఒత్తిడి, ఆందోళన వల్ల వచ్చిన నొప్పి అయితే నెమ్మదిగా ఊపిరి పీల్చి వదలడం లాంటివి చేస్తే తగ్గిపోతుంది. రోజులో కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడమూ తప్పనిసరే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్