అల్పాహారానికి జత చేయండి
‘ఈరోజేం చేయాలి?’ ఈ ప్రశ్నతోనే మన ఉదయాలన్నీ ప్రారంభమవుతాయి కదా! రుచిగా ఉండాలి, ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమివ్వాలి. ఇలా అయితే ఈ స్మూతీలను అల్పాహారంలో భాగం చేయమంటున్నారు నిపుణులు.
‘ఈరోజేం చేయాలి?’ ఈ ప్రశ్నతోనే మన ఉదయాలన్నీ ప్రారంభమవుతాయి కదా! రుచిగా ఉండాలి, ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమివ్వాలి. ఇలా అయితే ఈ స్మూతీలను అల్పాహారంలో భాగం చేయమంటున్నారు నిపుణులు. రోగనిరోధకతతోపాటు కావాల్సిన పోషకాలూ అందుతాయి.
* అరకప్పు ఫ్యాట్లేని పెరుగు, ఒక నారింజ, చిటికెడు పసుపు మిక్సీ పట్టివ్వండి. ఈ నారింజ- పసుపు స్మూతీ ద్వారా విటమిన్ సి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు తగినంత ప్రొటీన్లూ శరీరానికి అందుతాయి.
* పాలకూర, పుదీనాతో చేసిన స్మూతీలో పోషకాలెక్కువ. రుచిగా అనిపించకపోయినా దీన్నీ భాగం చేసుకోమంటున్నారు. వీటిలో ఎ, బి విటమిన్లతోపాటు జింక్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం అధికం. రక్తహీనతను దూరం చేసి గుండె ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
* అర ముక్క చొప్పున కివీ, నారింజకు కొన్ని స్ట్రాబెర్రీలు, నాన్ ఫ్యాట్ పెరుగు కలిపి మిక్సీ పట్టి, తాగిస్తే సరి. కివీ, నారింజల్లో విటమిన్ సి గుణాలెక్కువ. వీటి నుంచి రోజులో శరీరానికి అవసరమైన సి గుణాలన్నీ చేరతాయట.
* రోగనిరోధకత పెరగాలంటే బెర్రీ స్మూతీ తాగాలట. కానెబెర్రీ, స్ట్రాబెర్రీ, ఆపిల్, నిమ్మరసం మిక్సీపట్టి, కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే సరి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.
* ‘నీళ్లు తాగడం లేదు’ పిల్లల విషయంలో అమ్మల ఫిర్యాదుల్లో ఇదీ ఒకటి. వారికి అవకాడో లైమ్ స్మూతీ ఇవ్వండి. దీని ద్వారా ఎ, సి, ఇ విటమిన్లు అందుతాయి. రోగ నిరోధకతను పెంచే ఈ స్మూతీ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కూడా కాపాడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!