బరువును దూరం చేస్తాయి..

అమ్మవారికి  నైవేద్యంగా ఉంచే  శనగలు పోషకాల గనులు. ఇవి అధికబరువును తగ్గించడమే కాదు, ఆరోగ్యపరంగా ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

Published : 26 Aug 2022 00:56 IST

అమ్మవారికి  నైవేద్యంగా ఉంచే  శనగలు పోషకాల గనులు. ఇవి అధికబరువును తగ్గించడమే కాదు, ఆరోగ్యపరంగా ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.

హిళల్లో ఎక్కువగా కనిపించే ఇనుములోపం సమస్యను శనగలను తీసుకోవడం ద్వారా దూరం చేయొచ్చు. కప్పు శనగల్లో 26 శాతం ఇనుము ఉంటుంది. ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో ఇనుము ప్రాధాన్యత ఎక్కువ. మెదడు ఆరోగ్యాన్ని  పెంపొందిస్తాయి. కండరాలు, ఎముకలను బలోపేతం చేస్తాయి. శనగల్లో పుష్కలంగావృక్షాధార ప్రొటీన్లుండటంతో శాకాహారులకు ఇవి పోషకాహారం. వీటిలోని సి విటమిన్‌ శరీరం ఇనుమును పీల్చుకునేలా దోహదపడుతుంది.

జీర్ణశక్తిని..

వీటిలో పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెంపులో తోడ్పడటమే కాకుండా, అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. మలబద్ధకానికి దూరంగా ఉంచుతుంది. శనగలు శరీరంలో అధిక కెలోరీలను తగ్గిస్తాయి. రోజూ వీటిని ఆహారంలో భాగం చేసుకున్న వారు అధిక బరువు సమస్య నుంచి బయటపడినట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. వీటితో గ్యాస్‌ అనుకుంటే నానబెట్టి, ఉడికించి తీసుకుంటే మంచిది. గుప్పెడు శనగలు ఎన్నో పోషకాలను అందించడమే కాదు, పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. వీటిలోని ప్రొటీన్లు, పీచు ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో అధిక ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఇది బరువు సమస్యను దరిచేరనివ్వదు.

పోషకాలు..

వీటిలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బొహైడ్రేట్లు సహా మాంగనీస్‌, కాపర్‌, జింక్‌, ఫాస్పరస్‌, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలుంటాయి.  ఫోలేట్‌, విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటాయి. రోజూ చిన్న కప్పు శనగలను తీసుకుంటే నిండైన ఆరోగ్యంతో ఉండొచ్చు. వీటిలోని పీచు, ప్రొటీన్లు రక్తంలో గ్లూకోజు స్థాయులను సమన్వయం చేస్తాయి. టైప్‌2 డయాబెటిస్‌ను దరిచేరకుండా పరిరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్