ఈ నియమాలు పాటిస్తున్నారా!

ఇంటిల్లపాది సంరక్షణలో పడి మన గురించి మనం పట్టించుకోవడమే మానేస్తాం. ఉద్యోగినులైతే ఈ పరిస్థితి మరీ దారుణం. గృహిణులైనా, ఉద్యోగినులైనా.. బాధ్యతలను తీసుకోవడంతోపాటు కొన్ని నియమాలను పెట్టుకొని తప్పక పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Updated : 30 Aug 2022 09:11 IST

ఇంటిల్లపాది సంరక్షణలో పడి మన గురించి మనం పట్టించుకోవడమే మానేస్తాం. ఉద్యోగినులైతే ఈ పరిస్థితి మరీ దారుణం. గృహిణులైనా, ఉద్యోగినులైనా.. బాధ్యతలను తీసుకోవడంతోపాటు కొన్ని నియమాలను పెట్టుకొని తప్పక పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

* శరీరంపై దృష్టి.. ఇంట్లోవాళ్లకు వేళకు అన్ని సమకూర్చి పెడుతుంటాం. అలాంటి మనమే తరచూ జబ్బుపడితే ఎలా? శరీరంపై శ్రద్ధ పెట్టండి. చాలాసార్లు పిల్లలు మిగిల్చారనో, పాడవుతాయనో తినేస్తుంటాం. అదీ మంచిది కాదు. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోండి. వేళల్ని తప్పక పాటించండి. నీటిని తాగడమూ నియమంలా పెట్టుకోండి.

* నిద్ర సంగతేంటి?.. అందరికంటే ఆలస్యంగా పడుకోవడం, ముందు మేల్కోవడం చాలా ఇళ్లలో కనిపించేదే! వీలైనంత త్వరగా ముఖ్యంగా ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. కనీసం 7 గంటల నిద్ర ఉండేలా ప్లాన్‌ చేసుకోండి. వాటిని పక్కాగా పాటించండి. ఈ చిన్న పనే.. ఇదొక్కటీ సర్దేస్తే.. అంటూ వేళలు దాటనివ్వకండి.

* పరిధులుండాలి.. వేళ కాని వేళలు, సెలవుల్లోనూ ఉద్యోగులు పనిచేస్తుంటారు. తప్పనిసరి పరిస్థితులైతే సరే! కానీ దాన్ని కొనసాగనివ్వకండి. ఆఫీసు వేళల తర్వాత చేయడం కుదరదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేయండి. గృహిణులు కూడా సాయమడగగానే కుదరదంటే ఏమనుకుంటారోనని ఇబ్బందైనా చేస్తుంటారు. ఇబ్బందిగా ఉన్నప్పుడు విషయాన్ని చెప్పేసేయండి. పిల్లల ప్రాజెక్టుల విషయంలోనూ సాయం చేయండి ఫర్లేదు. పూర్తిగా చేస్తే వాళ్లెలా నేర్చుకుంటారు?

* విరామాలు.. ‘ఇంట్లోనే ఉండేది!’ ఎంత తేలిగ్గా మాట అనేస్తారు. కానీ ఎంత పని మనకోసం ఎదురు చూస్తుంటుంది. పని ముగిసేసరికి నీరసం ముంచుకొచ్చేస్తుంది. చిన్నచిన్న విరామాలు తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్