మర్చిపోవద్దు!
మగవారి కంటే మహిళల్లోనే అల్జీమర్స్ బాధితులు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక భద్రత తక్కువగా ఉండటం వల్ల మనం జీవిత చరమాంకంలో ఇబ్బందీ పడాల్సి వస్తుంది.
మగవారి కంటే మహిళల్లోనే అల్జీమర్స్ బాధితులు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆర్థిక భద్రత తక్కువగా ఉండటం వల్ల మనం జీవిత చరమాంకంలో ఇబ్బందీ పడాల్సి వస్తుంది. దానికి ఇలాంటి ఆరోగ్యసమస్యలూ తోడైతే మరింత ఇబ్బంది కదా! అందుకే ఆ ముప్పు రాకుండా చూసుకునే మార్గాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు.
పురుషులతో పోలిస్తే 10-50 ఏళ్ల మధ్య వయసు మహిళలు పదాల్ని గుర్తుపెట్టుకోవడం, ఇతర రకాలైన అభిజ్ఞా నైపుణ్యాల్లో ముందుంటారు. మెనోపాజ్ దశ దాటాక మాత్రం క్రమంగా జ్ఞాపకశక్తి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 60-70ల్లో ఈ సమస్య కనిపిస్తుందంటున్నారు. మెనోపాజ్‌తో ఈస్ట్రోడియల్(ఈస్ట్రోజన్ ప్రాథమిక రూపం)తో పాటు మరికొన్ని హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఈస్ట్రోడియల్ మెదడులో పనిచేస్తుంది. దీని తగ్గుదల కారణంగా అక్కడ కణాల సృష్టి, వాటి అనుసంధానం, అంతరించడం.. ప్రభావితం అవుతాయి. తద్వారా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ దశలో మెదడు కణాల ప్రధాన ఇంధనమైన గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. మెనోపాజ్‌కి మధుమేహం, రక్తపోటూ తోడైతే అల్జీమర్స్ ముప్పు మరింత ఎక్కువ. సంతోషించదగ్గ విషయం ఏంటంటే దీన్ని నివారించుకోగలగటం.
* ప్రధానంగా శారీరక వ్యాయామం, మెదడుకు మేత, సాంఘిక జీవనం మీద దృష్టి పెట్టాలి. మొదటి రెండూ మెదడులో కణాల పనితీరుని మెరుగు పరిస్తే.. సాంఘిక జీవనం కొత్త అనుభవాలతోపాటు భౌతికపరమైన అంశాల్ని గుర్తు పెట్టుకోవడంలో సాయపడుతుంది.
* దీన్లో ఆహారానిదీ కీలక పాత్రే. కాయగూరలూ, పండ్లు, ఎండు పండ్లు, చేపలకు ప్రాధాన్యం ఉండే మెడిటేరియన్ డైట్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. తగినంత నిద్రా ముఖ్యమే. రాత్రుళ్లు కనీసం ఏడు గంటలు నిద్రపోవాలి. అనుభవాల్ని శాశ్వత సమాచారంగా మార్చడంలో నిద్ర పాత్ర చాలా కీలకం.
* మహిళలందరూ, ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు ఉన్నవాళ్లు వీటిని ముందునుంచే అనుసరించాలి. ఎందుకంటే వీరిలో అభిజ్ఞా నైపుణ్యాలు (ఆలోచించడం, నేర్చుకోవడం, చదవడం, గుర్తుపెట్టుకోవడం, ఏకాగ్రత) తగ్గే ప్రమాదం మిగతా వారికంటే ఎక్కువ.
ఇలా చేయండి...
* జ్ఞాపకశక్తి సన్నగిల్లడానికి ప్రధాన కారణాల్లో పరధ్యానం ఒకటి. కాబట్టి వర్తమానంలో ఉండండి.
* నిత్యం పరీక్షించుకుంటూ, జ్ఞాపకశక్తిని పెంచుకోండి. పచారీ సామాన్ల జాబితా రాసుకొని... దుకాణానికి వెళ్లాక అది తీయకుండానే గుర్తుచేసుకోండి. అన్నీ అయ్యాక లిస్టుతో సరిచూసుకోండి. జీపీఎస్ వాడే వారిలో భౌగోళిక అంశాల్ని గుర్తు పెట్టుకునే సామర్థ్యం తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
* సంగీతం, కొత్త భాష, ఏదైనా సృజనాత్మక ప్రక్రియ... ఇలా ఏదో ఒక నైపుణ్యాన్ని నిత్యం నేర్చుకోండి. ఏ వయసులో ఉన్నా, చెస్, సుడొకు లాంటివి నేర్చుకోండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!