మోకాళ్ల నొప్పులకు దండ యోగా

బరువు తగ్గడానికి వెయిట్‌ లాస్‌ సెంటర్లు, ప్రకృతి వైద్యశాలల్లో చేరుతుంటారు. డైటింగ్‌ పేరుతో అర్ధాకలితో అలమటించడమూ కద్దు. అలాంటి ప్రయాసలేమీ లేకుండా ‘దండ యోగా’ చేసి చూడండి. లావు తగ్గడమే కాదు, పొట్ట, నడుము నాజూగ్గా తయారవుతాయి. మోకాళ్ల నొప్పులూ తగ్గుతాయి...

Published : 03 Sep 2022 00:23 IST

బరువు తగ్గడానికి వెయిట్‌ లాస్‌ సెంటర్లు, ప్రకృతి వైద్యశాలల్లో చేరుతుంటారు. డైటింగ్‌ పేరుతో అర్ధాకలితో అలమటించడమూ కద్దు. అలాంటి ప్రయాసలేమీ లేకుండా ‘దండ యోగా’ చేసి చూడండి. లావు తగ్గడమే కాదు, పొట్ట, నడుము నాజూగ్గా తయారవుతాయి. మోకాళ్ల నొప్పులూ తగ్గుతాయి.

ర్ర సాయంతో చేసేదే దండ యోగా. బరువు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నడుము, పొట్ట దగ్గరున్న కొవ్వు చాలా వేగంగా తగ్గిపోతుంది. కింద కూర్చుని కాళ్లు ముందుకు జాపి, వీలైనంత దూరానికి జరపాలి. ఫొటోలో చూపినట్లుగా రెండు చేతులతో కర్రను పట్టుకుని వీపు దగ్గరకు తీసుకెళ్లి అక్కడుంచాలి. కర్ర ఆసరాగా ఉంటుంది. దాని వల్ల ముందుకి, వెనక్కి వంగకుండా తిన్నగా కూర్చోగలుగుతాం. మెల్లగా శ్వాస వదులుతూ వీలైనంతగా కుడివైపు తిరిగి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. శ్వాస వదులుతూ వీలైనంత ఎడమ వైపు తిరగాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితిలోకి అంటే మధ్యలోకి రావాలి. అలా కుడివైపు ఒకసారి, ఎడమవైపు ఒకసారి చొప్పున మార్చి మార్చి ఇరవై సార్లు చేయాలి. దీనివల్ల నడుము సన్నగా, నాజూగ్గా, ఆకర్షణీయంగా తయారవుతుంది.

తర్వాత అలానే కూర్చుని రెండు చేతులతో కర్ర పట్టుకుని పైకి చాపి, శ్వాస వదులుతూ కుడివైపు వీలైనంత వంగాలి. శ్వాస తీసుకుంటూ ఎదురుగా రావాలి.

శ్వాస వదులుతూ ఎడమవైపు వీలైనంత వంగాలి. శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి. ఇలా కుడి, ఎడమలకు మార్చి మార్చి ఇరవైసార్లు చేయాలి.

దీనివల్ల పొట్ట, తొడల వద్ద పేరుకున్న కొవ్వు త్వరగా తగ్గిపోతుంది. మోకాళ్ల నొప్పులకు ఇది చాలా మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్