డైట్‌ కొనసాగించాలా?

ఆరోగ్యం, అందం కారణమేదైనా చూపు ముందు డైట్‌ మీదకే పోతుంది. కచ్చితంగా పాటించేయాలని గట్టిగా అనుకుంటామా! స్నేహితులు, వేడుకలు, కొన్నిసార్లు వృథా అయిపోతాయని ఆ ప్రామిస్‌ను పక్కన పెట్టేయడానికి బోలెడు కారణాలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ దాటి కొనసాగించాలంటే...

Published : 04 Sep 2022 00:56 IST

ఆరోగ్యం, అందం కారణమేదైనా చూపు ముందు డైట్‌ మీదకే పోతుంది. కచ్చితంగా పాటించేయాలని గట్టిగా అనుకుంటామా! స్నేహితులు, వేడుకలు, కొన్నిసార్లు వృథా అయిపోతాయని ఆ ప్రామిస్‌ను పక్కన పెట్టేయడానికి బోలెడు కారణాలు ఎదురవుతుంటాయి. వాటన్నింటినీ దాటి కొనసాగించాలంటే...

* మీ శరీరం మాట వినండి. ఆకలేసిందా ఏదో ఒకటి తినండి. అంతేకానీ ‘ఫలానా సమయానికే తినాలి’ అంటూ భీష్మించుకొని కూర్చున్నారో.. కొత్త సమస్యలొస్తాయి. అంతేనా కొద్దిరోజుల్లోనే విసుగొచ్చి స్నేహితులు బలవంతం చేశారనో, వేడుకనో తప్పించుకొనే మార్గాలకోసం చూస్తుంటాం. మళ్లీ కొనసాగించలేకపోయామే అనే గిల్టీ ఫీలింగ్‌. కాబట్టి.. ఇవే తినాలి, ఇప్పుడే తినాలన్న కఠిన నియమాలొద్దు. ప్రత్యామ్నాయ మార్గాలకోసం వెతకండి. నూనెతో చేసిన స్నాక్స్‌కు బదులు ఓ యాపిల్‌ అలా అన్నమాట.

* ప్రతి ఒక్కరికీ నచ్చిన వంటకాలు కొన్నుంటాయి. ఒక్కసారిగా వాటిని పక్కన పెట్టేయడం కష్టమే. డైట్‌ పేరు చెప్పి బలవంతంగా నోరుకట్టుకుందామనుకున్నా శరీరమూ సహకరించదు. కాబట్టి నెమ్మదిగా అలవాటు చేయాలి. చాలామంది ‘ఆరోగ్యం’ పేరు చెప్పి పచ్చి, చప్పటి వాటికే ప్రాధాన్యమిస్తుంటారు. నోటికి సహించనిది శరీరానికి మాత్రం ఎలా సహిస్తుంది? పైగా మనకు నెలసరి వంటి కొన్ని భిన్న పరిస్థితులుంటాయి. వాటిల్లో తేడాలొస్తాయి. తినేదేదైనా రుచికరంగా ఉండేలానూ చూసుకోండి. నచ్చనిది, ఒంటికి సహించనిది ఏదైనా పక్కన పెట్టేయండి.

* డైట్‌ మొదలుపెట్టాక చాలామంది బరువు తగ్గినా మునుపటి ఉత్సాహం కనిపించదు. కారణం కొవ్వు తగ్గడంపైనే దృష్టిపెట్టడం! ప్రొటీన్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఒమెగా 3, బయోటిన్‌, మినరల్స్‌ ఇలా బోలెడు న్యూట్రియంట్లు శరీరానికి రోజూ అందాలి. ఇవి అందుతూనే తక్కువ ఆకలివేసే వాటిని ఎంచుకుంటే కొనసాగించడం సాధ్యమవుతుంది.

* జ్యూస్‌లు, పాలు, సూప్‌లు.. ఏదో రూపేనా తగినంత నీరు శరీరానికి అందేలా చూసుకోండి. శరీరాన్ని హైడ్రేట్‌ చేయడమే కాదు.. చర్మం, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. పైగా తక్కువ కేలరీలతో ఎక్కువసేపు ఆకలిని ఆపే మార్గమిది. ఉదయాన్ని గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభిస్తే జీవక్రియలూ సక్రమంగా సాగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్