ఆయుష్షు పెంచే ఆలివ్‌ నూనె..

రోజూ అరచెంచా ఆలివ్‌నూనె ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. తాజాగా హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం అధ్యయనం ఇదే తేల్చి చెప్పింది.

Published : 05 Sep 2022 01:14 IST

రోజూ అరచెంచా ఆలివ్‌నూనె ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. తాజాగా హార్వర్డ్‌ విశ్వ విద్యాలయం అధ్యయనం ఇదే తేల్చి చెప్పింది.

మెరికాకు చెందిన 50వేలమంది నర్సుల ఆహారపుటలవాట్లను 28 ఏళ్లు పరిశీలించారు. కొవ్వు, మయోనైజ్‌, వెన్న, కూరగాయలు, పండ్ల్లతోపాటు రోజూ అరచెంచా ఆలివ్‌నూనె తీసుకొనేవారిలో 17 శాతం మంది క్యాన్సర్‌, 18 శాతంమంది ఊపిరితిత్తుల వ్యాధులు, 19 శాతంమంది హృద్రోగం, 29 శాతంమంది నరాలవ్యాధికి దూరంగా ఉన్నట్లు తేలింది. పాలీఫినాల్స్‌, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలుండి, హృదయనాళాల్లో కొవ్వు పేరుకోకుండానూ చేసి, రక్తప్రసరణను ఇది సజావుగా చేస్తుందని తేలింది.

ఆరోగ్య ప్రయోజనాలు..

ఆలివ్‌నూనె వినియోగం శరీరాన్ని శక్తివంతం చేస్తుంది. కుంగుబాటు, ఆందోళనను దూరంగా ఉంచుతుంది. రొమ్ము క్యాన్సర్‌ను సోకనివ్వదు. మెనోపాజ్‌ దాటిన తర్వాత సాధారణంగా మహిళలెదుర్కొనే అల్జీమర్స్‌ వ్యాధి దరిచేరనివ్వదు. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్