సైకిల్‌ని బట్టి వ్యాయామం!

బద్ధకమో, ఓపిక లేదనో మొదలు పెట్టిన కొన్నిరోజులకే మనలో చాలా మంది వ్యాయామం మానేస్తుంటాం. దీనికితోడు నెలసరి సమస్యా ఉంటుంది. దీని కారణంగా రోజూ భావోద్వేగాలు, ఒంట్లో సత్తువ పరంగా మనలో ఏదో ఒక మార్పు. అందుకే నీరసం, బద్ధకం వగైరా. ఈ సైకిల్‌కి తగ్గట్టుగా వ్యాయామం ప్లాన్‌ చేసుకుంటే ఈ సమస్యలుండవంటున్నారు నిపుణులు.

Published : 08 Sep 2022 00:52 IST

బద్ధకమో, ఓపిక లేదనో మొదలు పెట్టిన కొన్నిరోజులకే మనలో చాలా మంది వ్యాయామం మానేస్తుంటాం. దీనికితోడు నెలసరి సమస్యా ఉంటుంది. దీని కారణంగా రోజూ భావోద్వేగాలు, ఒంట్లో సత్తువ పరంగా మనలో ఏదో ఒక మార్పు. అందుకే నీరసం, బద్ధకం వగైరా. ఈ సైకిల్‌కి తగ్గట్టుగా వ్యాయామం ప్లాన్‌ చేసుకుంటే ఈ సమస్యలుండవంటున్నారు నిపుణులు.

* మెన్‌స్ట్రువేషన్‌.. నెలసరి ప్రారంభ రోజు నుంచి ఏడురోజులను దీనికింద చేర్చొచ్చు. శక్తిస్థాయులు చాలా తక్కువగా ఉంటాయి. పొట్ట, వీపు నొప్పి, ఆకలి లేకపోవడం సహజం. ఈ రోజుల్లో చాలా తక్కువ స్థాయి వ్యాయామాలు చేయాలట. తేలిక పాటి నడక, యోగా వంటివి చాలు.

* లేట్‌ ఫాలిక్యులర్‌ (7-13 రోజులు).. శక్తిస్థాయులు మెరుగ్గా ఉంటాయి. ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మోతాదు పెరిగి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ సమయంలో బాగా కష్టమైన వ్యాయామాలకు ప్రాధాన్యమివ్వాలి.

* ఒవులేషన్‌ (14-20).. టెస్టోస్టిరాన్‌ ఎక్కువ విడుదలవుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికీ సాయపడుతుందట. ఈ సమయంలో స్ట్రెంత్‌నింగ్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే మంచిది.

* 20-23 రోజుల్లో.. ఈ సమయంలో శరీరం సులువుగా అలసిపోతుంటుంది. టెస్టోస్టిరాన్‌ విపరీతంగా విడుదలవ్వడమే కారణం. కాబట్టి మధ్యస్థ వ్యాయామాలైన పైలేట్స్‌, జాగింగ్‌, స్విమ్మింగ్‌ వంటివి మేలు.

* 24-28 రోజులు.. ఇది నెలసరి ముందు దశ. ఉదయాన్నే అకారణ కోపం, చిరాకు, కడుపుబ్బరం, నిస్సత్తువ ఉంటాయి. ఈ సమయంలో నడక, యోగా, ప్రాణాయామం వంటివి చేస్తే శరీరంతోపాటు మనసుపైనా సానుకూల ప్రభావం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్