కప్పు ఛాయ్‌తో...

ఇల్లు, ఆఫీస్‌ పని మధ్యలో బాగా అలసినట్లు అనిపిస్తే వేడివేడిగా తాగే కప్పు ఛాయ్‌ శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేసినట్లు అనిపిస్తుంది. ఇలా పని మధ్యలో తీసుకునే ఒకటీరెండు టీలతో మెదడు రిఫ్రెష్‌

Published : 09 Sep 2022 00:53 IST

ఇల్లు, ఆఫీస్‌ పని మధ్యలో బాగా అలసినట్లు అనిపిస్తే వేడివేడిగా తాగే కప్పు ఛాయ్‌ శరీరాన్ని తిరిగి శక్తిమంతం చేసినట్లు అనిపిస్తుంది. ఇలా పని మధ్యలో తీసుకునే ఒకటీరెండు టీలతో మెదడు రిఫ్రెష్‌ కావడమే కాదు, ఆరోగ్యానికీ ఎంతో మేలు అంటూ తాజా అధ్యయనం ఒకటి మరోసారి తేల్చి చెప్పింది.

ఆమెరికా నేషనల్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు అయిదు లక్షల మందిని, వారికున్న టీ అలవాటు గురించి సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టారు. అలా వారిని 14 ఏళ్లు పరిశీలించారు. టీ అలవాటున్న వారిలో ఎక్కువశాతం మంది పలురకాల అనారోగ్యాల బారిన పడకుండా ఉన్నట్లు గుర్తించారు. తాజాగా అన్నాల్స్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. ఎండిన, హెర్బల్‌ లేదా అనాక్సిడైజ్డ్‌ ఆకుల నుంచి తయారుచేసే గ్రీన్‌ టీ.. ఎందులోనైనా యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే పాలీఫినాల్స్‌ పుష్కలంగా ఉంటాయి. రోజూ తీసుకునే ఓ కప్పు టీవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. హృద్రోగాలకు దూరంగా ఉండొచ్చు. మానసికారోగ్యం పెంపొందుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. టీ వల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి, బరువును పెరగనివ్వవు. కాలేయ పనితీరు బాగుంటుంది. టైప్‌2 మధుమేహం దరికి చేరదు. మెనోపాజ్‌లో ఎదురయ్యే అల్జీమర్స్‌ నుంచి తప్పించుకోవచ్చు. టీలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మంలో రక్తప్రసరణను సవ్యంగా జరిగేలా చేసి చర్మ సంబంధిత అనారోగ్యాలను తగిస్తాయి. అంతేకాదు, ఫ్రీరాడికల్స్‌, బీటా అమిలాయిడ్‌ పెప్టైడ్స్‌ బారి నుంచి మెదడు కణాలను కాపాడే గుణాలు టీ లో మెండు. ఇవి మెదడును నిత్యం చురుకుగా ఉండేలా చేసి మతిమరపును దూరం చేస్తాయి. వయసు మీరిన తర్వాత కూడా జ్ఞాపకశక్తి చక్కగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు ఓ కప్పు టీతో ఉపశమనం పొందొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఆహారపుటలవాట్లకు టీనీ జత చేసుకుంటే శారీరక, మానసికారోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని చెబుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్