మెనోపాజ్‌కు ముందుగానే..
శారీరకంగా, మానసికంగా మెనోపాజ్ పలు మార్పులను తీసుకొస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
శారీరకంగా, మానసికంగా మెనోపాజ్ పలు మార్పులను తీసుకొస్తుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.
రుతుక్రమం ఆగేముందు నుంచే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. లేదంటే హృద్రోగం, మధుమేహం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి పలురకాల అనారోగ్య సమస్యలెదురయ్యే ప్రమాదం ఉంది. శరీరానికి తగినంత నీటిని అందించాలి. లేకపోతే చర్మం పొడారడం, శరీరమంతా ఉబ్బరంగా మారడం, అధికబరువు వంటి వాటికి ఆస్కారం ఉంది. రోజూ ఆరేడు లీటర్ల నీటిని తాగడం మానకూడదు. అప్పుడే చర్మం తేమగా మారుతుంది. ముఖంపై ముడతలు, గీతలు, పొడారడం వంటి సమస్యలను ముందుగానే నిరోధించొచ్చు. రోజుకి ఏడు గంటల నిద్ర జీవక్రియలను సక్రమంగా జరిగేలా చేస్తుంది.
హార్మోన్లు..
ఈ దశలో జరిగే హార్మోన్ల మార్పును సమతుల్యం చేయాలంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు అధికంగా ఉండే ఆహారానికి పెద్దపీట వేయాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటే మంచిది. నిత్యం అరగంట వ్యాయామం చేయాలి. నడక, చిన్నచిన్న వ్యాయామాలు కండరాలను బలోపేతం చేస్తాయి. యోగా, ధ్యానం వంటివి మానసికారోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటివాటికి దూరంగా ఉండొచ్చు. మెనోపాజ్ సమయంలో కావాల్సినంత క్యాల్షియం శరీరానికి అందదు. ఎముకలు బలహీనపడతాయి. కాల్షియంతోపాటు విటమిన్ డీ వంటివాటిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటే దీన్ని సమత్యులం చేయొచ్చు. చక్కెర స్థాయుల్లో జరిగే హెచ్చుతగ్గులు తీవ్ర కుంగుబాటుకు దారి తీస్తాయి. దీన్ని నిరోధించాలంటే చక్కెరను తగ్గించాలి, ప్రాసెస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
చురుకుగా..
మెనోపాజ్ వచ్చిన తర్వాత కుంగుబాటు వచ్చే అవకాశం ఉంది. బాధ్యతలు తీరుతున్న ఈ సమయంలో నచ్చిన అభిరుచికి ప్రాధాన్యతనిస్తే ఇందులోంచి బయటపడొచ్చు. తోటపని, కుట్టు పని లేదా చిరువ్యాపారం వంటివన్నీ మెదడును చురుకుగా చేస్తాయి. మనసు ఉత్సాహంగా మారుతుంది. 50 ఏళ్లు దాటాకా నచ్చిన కెరియర్లో అడుగుపెట్టి విజయం సాధిస్తున్న మహిళల గురించి తెలుసుకొని, వారి సలహాలను పాటించి ముందడుగు వేస్తే చాలు. మెనోపాజ్ ప్రభావం నుంచి దూరంగా ఉండొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!