ఉల్లి... ఎంతో మేలు
ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఉల్లిపాయలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కూర, పప్పు, చారు ప్రతిదాంట్లో వేస్తాం మరి. పచ్చిపులుసు, ఆనియన్ దోశల ఘుమాయింపంతా ఉల్లిలోనే ఉందంటే కాదనగలరా?! ఉల్లి వేయడం వల్లే గ్రేవీ వస్తుంది. అంతకు మించి కూరలకు రుచీ పరిమళం. పచ్చి ఉల్లిపాయలతో పచ్చడిచేసి తాలింపు పెడితే ‘ఆహా ఏమి రుచీ’ అనేస్తారంతా...
ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా ఉల్లిపాయలు మాత్రం తప్పకుండా ఉంటాయి. కూర, పప్పు, చారు ప్రతిదాంట్లో వేస్తాం మరి. పచ్చిపులుసు, ఆనియన్ దోశల ఘుమాయింపంతా ఉల్లిలోనే ఉందంటే కాదనగలరా?! ఉల్లి వేయడం వల్లే గ్రేవీ వస్తుంది. అంతకు మించి కూరలకు రుచీ పరిమళం. పచ్చి ఉల్లిపాయలతో పచ్చడిచేసి తాలింపు పెడితే ‘ఆహా ఏమి రుచీ’ అనేస్తారంతా. సర్వకాల సర్వావస్థల్లో దొరికే ఉల్లిపాయలో ఎన్ని సుగుణాలున్నాయో, ఎంత మేలు చేస్తుందో చూడండి...
* ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, పీచు ఉన్నందున శరీరానికి పుష్టినిస్తుంది.
* జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. కురులు రాలకుండా నివారిస్తుంది. చుండ్రును తగ్గించడంలోనూ ఉపయోగపడుతుంది. అన్నిటి కంటే ముఖ్యమైంది.. త్వరగా తెల్లజుట్టు రాకుండా అడ్డుకుంటుంది. ఇదెంత శుభవార్తో కదా! ఊపిరాడని పనులతో అలసిపోయే మనకి తలకు రంగువేసుకోవడం మరో భారమే మరి.
* ముఖం మీద ఏర్పడే మచ్చలు, కంటి కింద వచ్చే చారలు, పింపుల్స్ తగ్గుతాయి. చర్మం ముడతలు పడటం, పొడిబారడం లాంటి వృద్ధాప్య లక్షణాలను నివారించి ప్రకాశవంతం చేస్తుంది.
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢమవుతాయి. శ్వాస ఇబ్బందులు తొలగుతాయి. తలనొప్పి, అధిక రక్తపోటు, నోటిపూత.. లాంటి అనేక అనారోగ్యాలకు ఉల్లిపాయ దివ్య ఔషధం. మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలను నివారిస్తుంది.
* ఉల్లిలోని యాంథోసియానిన్స్ గుండెను సంరక్షిస్తాయి. రక్తంలో క్లాట్స్ ఏర్పడవు. బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తాయి. క్యాన్సర్‌ను సైతం నివారిస్తాయి.
* ఉల్లితో గాయాలు, దద్దుర్లు, మంట, తాపం, అలర్జీలు, సైనస్ తగ్గుతాయి. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, హాయిగా నిద్రపడుతుంది. మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగు పరుస్తుంది.
* వీటిల్లో ఇన్నిన్ని లాభాలున్నాయని మనలో చాలామందికి తెలియకపోతేనేం.. రోజూ ఏదో రూపంలో తింటున్నాం. కానీ ఉల్లిపాయను వేయిస్తే లేదా ఉడికిస్తే అందులో ఉన్న సుగుణాల ప్రభావం తగ్గుతుంది కనుక వీలైన సందర్భాల్లో పచ్చిది తినడం మరింత శ్రేష్ఠం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!