ఆందోళన పని పట్టేయండి!

తరచూ హార్మోనుల్లో వచ్చే మార్పులకు తోడు.. రోజువారీ పనుల్లో ఆలస్యం, అన్నింటినీ పక్కాగా చేయాలన్న తాపత్రయం.. మనకు ఆందోళన కలిగించే విషయాలెన్నో! వాటికి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు మంచి ప్రత్యామ్నాయమంటున్నారు నిపుణులు.

Published : 15 Sep 2022 00:37 IST

తరచూ హార్మోనుల్లో వచ్చే మార్పులకు తోడు.. రోజువారీ పనుల్లో ఆలస్యం, అన్నింటినీ పక్కాగా చేయాలన్న తాపత్రయం.. మనకు ఆందోళన కలిగించే విషయాలెన్నో! వాటికి బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు మంచి ప్రత్యామ్నాయమంటున్నారు నిపుణులు.

* దీర్ఘశ్వాస.. రెండు చేతుల్నీ ఛాతిపై ఉంచండి. కాస్త తలపైకి ఎత్తి కళ్లు మూసుకొని ముక్కుతో దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదలండి. ఇలా కొన్ని సార్లు చేస్తే చాలు. ఎక్కడైనా ఏ సమయంలోనైనా తేలిగ్గా చేయగలిగే ఈ వ్యాయామం ఆందోళన నుంచి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుందట. కూర్చొని, నిల్చొని, పడుకొని ఎలాగైనా దీన్ని ప్రయత్నించొచ్చు.

* ఫోకస్‌ చేస్తూ.. కడుపు ఉబ్బేలా గుండెల నిండా గాలిపీల్చాలి. నెమ్మదిగా నోటితో శ్వాసను బయటకు వదలాలి. ఆ సమయంలో మీ దృష్టంతా పొట్ట పరిమాణం మారడంపైనే ఉండాలి. వేరే ఆలోచనలేమైనా వస్తున్నా దీనిపైనే దృష్టి పెట్టాలి. మనసు తేలిక పడేంతవరకూ, గుండె వేగం సాధారణ స్థితికి చేరేవరకూ దీన్ని కొనసాగించాలి. దేనిమీదా ఫోకస్‌ పెట్టలేకపోతున్నా అనిపించినా దీన్ని ప్రయత్నించొచ్చు. దీన్ని కూర్చొనైనా, పడుకొనైనా చేయొచ్చు.

* రెండింటినీ.. నేలపై పడుకోవాలి. ఒక చేతిని గుండెపై, మరో చేతిని పొట్టపై ఉంచాలి. దీర్ఘశ్వాస తీసుకొని కొంచెంసేపు గాలిని బంధించి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా వదులుతూ ఒకసారి పొట్ట కదలికలను గమనిస్తే, మరోసారి ఛాతి పొంగడం, సాధారణ స్థితికి రావడంపై దృష్టిపెట్టాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్నీ మెరుగుపరుస్తుందట. ఒక్కోసారి అనుకోని భయం, ఆందోళన ఊపిరి ఆడనివ్వనట్లుగా చేస్తుంది. అప్పుడిది బాగా పనిచేస్తుంది.

* ఇవన్నీ సాధారణ ఆందోళనను దూరం చేస్తాయి. ఆ స్థాయి దాటి రోజువారీ కార్యకలాపాలు, నిద్రకు భంగం కలిగించడం, ప్రతికూల ఆలోచనలను పెంచడం వంటి తీవ్ర పరిస్థితులు కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్