జలుబుకు చెక్‌ చెప్పేద్దాం...

వర్షాకాలం కదా... చిరుజల్లులూ, జడివానలూ కురుస్తూనే ఉంటాయి. గొడుగులూ రెయిన్‌కోట్‌లూ సంచిలోంచి తీసేలోపే కాస్తయినా తడుస్తుంటాం. ఆ మాత్రానికే తమకేదో పిలుపు అందినట్టుగా జలుబూ

Updated : 17 Sep 2022 04:29 IST

వర్షాకాలం కదా... చిరుజల్లులూ, జడివానలూ కురుస్తూనే ఉంటాయి. గొడుగులూ రెయిన్‌కోట్‌లూ సంచిలోంచి తీసేలోపే కాస్తయినా తడుస్తుంటాం. ఆ మాత్రానికే తమకేదో పిలుపు అందినట్టుగా జలుబూ జ్వరం వచ్చిపడతాయి. ఎంత విసుగ్గా, అసహనంగా ఉంటుందో కదూ! అందుకే పడిశం పది రోగాల పెట్టు అన్నారు. ఇక సైనసైటిస్‌ గనుక ఉంటే చెప్పాల్సిందేముంది?! కాస్త చల్లటి గాలి సోకినా ముక్కు మూసుకుపోయి నానా యాతనగా ఉంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం భుజంగాసనాన్ని ప్రయత్నించండి.

ఎలా చేయాలంటే...
భుజంగమంటే పాము. పాములా శరీర ముందు భాగాన్ని పైకి లేపడమే భుజంగాసనం. బోర్లా పడుకుని రెండు అరచేతులూ ఉదరభాగానికి పక్కన ఆనించి ఉంచాలి. రెండు కాళ్లనూ దగ్గరగా పెట్టుకోవాలి. కదిలించకూడదు. మెల్లగా శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపాలి. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వెనక్కి వంగాలి. కొన్ని క్షణాలు ఆగి మెల్లగా శ్వాస వదులుతూ నుదుటి భాగాన్ని కిందికి పెట్టాలి. భుజాలను, తలను ఎంతవరకూ లేపగలిగితే అంతవరకే పైకి లేపి వీలైనంత వెనక్కి వంగేందుకు ప్రయత్నించాలి. ఈ స్థితిలో 5 నుంచి 10 క్షణాల వరకూ ఉండి, శ్వాస వదులుతూ ముందుకు రావాలి. ఇలా 3 నుంచి 6 సార్లు జాగ్రత్తగా చేయాలి.


ఇవీ లాభాలు...

* ఊపిరితిత్తులు బలపడతాయి. ఉబ్బసం, సైనసైటిస్‌ సమస్యతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది.

* శరీరం సరళంగా వంగుతుంది. భుజాలు, నడుము, వెన్నెముక, పొత్తికడుపు భాగాలు ఉత్తేజితమవుతాయి. అధిక కొవ్వు తగ్గుతుంది.

* రక్త సరఫరా సవ్యంగా ఉంటుంది. జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. నెలసరి సమస్యలు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్