కాబోయే తల్లికి.. కంటినిండా నిద్ర!
గర్భధారణలో నెలనెలా పెరిగే పొట్టే కాదు.. హార్మోనుల్లో మార్పులూ కాబోయే అమ్మకు కునుకు లేకుండా చేస్తాయి. కడుపుబ్బరం, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇలా బోలెడు సమస్యలు.
గర్భధారణలో నెలనెలా పెరిగే పొట్టే కాదు.. హార్మోనుల్లో మార్పులూ కాబోయే అమ్మకు కునుకు లేకుండా చేస్తాయి. కడుపుబ్బరం, పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇలా బోలెడు సమస్యలు. వీటిని దాటి కంటి నిండా నిద్రపోవాలా.. వీటిని పాటించేయండి.
* గర్బధారణలో హార్మోనుల్లో మార్పులు సాధారణంగానే గ్యాస్, గుండె పట్టేసినట్టు అనిపించడం లాంటి వాటికి దారితీస్తాయి. వీటికితోడు కూల్‌డ్రింక్‌లు, సిట్రస్ ఫలాలు, పెప్పర్మింట్, టొమాటో వంటివి తీసుకున్నారో సమస్య పెరగొచ్చు. ఫలితమే రాత్రుళ్లు సరిగా నిద్రపట్టకపోవడం. వీటికి వీలైనంత దూరంగా ఉండండి. కారం, ఎక్కువ కొవ్వులు ఉన్నవాటినీ తీసుకోవద్దు.
* నెలలు నిండేకొద్దీ అరుగుదల మందగిస్తుంది. పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందు ఏమీ తినకపోవడం మంచిది. ఆకలేస్తే త్వరగా జీర్ణమయ్యే పండ్లను తీసుకోవడం మేలు.
* భోజనం విషయంలో మూడు పూటలు అన్న లెక్కను పాటించొద్దు. ప్రతి రెండు గంటలకోసారి కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. తినేప్పుడు మంచినీరు తాగొద్దు. తప్పనిసరి అయితే కొద్దిగా తీసుకోవచ్చు. భోజనం పూర్తయ్యాక అరగంట తర్వాతే తాగాలి. అప్పుడే ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది. పడుకోవడానికి కనీసం గంట ముందు నీళ్లు తాగకుండా ఉంటే మంచిది. మూత్రానికి పదే పదే లేవాల్సిన బాధ ఉండదు.
* కాఫీకి వీలైనంత దూరంగా ఉండండి. ఇది నిద్రకు భంగం కలిగించడమే కాదు.. చిన్నారి ఎదుగుదలపైనా ప్రభావం చూపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!