కాకరతో.. రక్తహీనత దూరం!

కాకరకాయ పేరు చెబితే చాలు కొందరు ముఖం వెగటుగా పెట్టేస్తారు. కానీ దాని వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిస్తే ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకోవాల్సిందే! ఇంటిల్లిపాది ఆరోగ్యాన్నీ సంరక్షించే ఇల్లాలు వాటి మీద కాస్తంత మక్కువ

Published : 19 Sep 2022 00:33 IST

కాకరకాయ పేరు చెబితే చాలు కొందరు ముఖం వెగటుగా పెట్టేస్తారు. కానీ దాని వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిస్తే ఆశ్చర్యంతో బుగ్గలు నొక్కుకోవాల్సిందే! ఇంటిల్లిపాది ఆరోగ్యాన్నీ సంరక్షించే ఇల్లాలు వాటి మీద కాస్తంత మక్కువ పెంచుకుంటే ఆ చేదైన కాయలతోనే రుచికరమైన వంటలు చేయొచ్చు. ఇంతకీ అందులో ఉన్న సుగుణాలేంటో చూద్దాం...

* కాకరకాయలో విటమిన్లు, ఐరన్‌, జింక్‌, పొటాషియం, కొవ్వు, పీచు, పిండిపదార్థం అధికంగా ఉన్నందున మంచి పోషకాహారం. అధిక బరువుతో బాధపడే మహిళల పాలిట కాకరకాయ వరం. కొద్దిరోజుల పాటు కాకరకాయ రసం ఒక చెంచా సేవించినట్లయితే బరువు తగ్గుతారు.

* అందచందాలకు మూలం చర్మం. అది ముడతలు పడకుండా, నిగారింపుతో ఉంటే ముప్పావు మార్కులు సంపాదించినట్టే. కాకరకాయ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తేటగా ఉంటుంది. దేశంలో 40 శాతం స్త్రీలు ఎనీమియాతో బాధపడుతున్నట్టు సర్వేల్లో తేలింది. కాకరకాయ తినడం వల్ల హిమోగ్లోబిన్‌ వృద్ధి చెందుతుంది.

* కాకరకాయలోని యాంటీమైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. పేగుల్లో చేరిన మలినాలు తొలగుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జీవప్రక్రియ సమయంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్‌ను, ఇతర ప్రమాదకర సమ్మేళనాలను ఎలాంటి సైడ్‌ ఎఫెక్టులూ లేకుండా నాశనం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

* కాలేయానికి మంచిది. మూత్రపిండాల్లో ఉన్న ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలు తొలగుతాయి. శరీరం డీహైడ్రేట్‌ కాదు. ఇందులో ఉండే పాలిపెప్టయిడ్‌-పి, విసైన్‌ రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ స్థాయిని తగ్గించడంలో దోహదం చేస్తాయి. తరచుగా కాకరకాయ తినడం వల్ల  మధుమేహం అదుపులో ఉంటుంది.

* ఇది యాంటీ హిస్టామిన్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఉబ్బసం, బ్రాంకైటిస్‌, ముక్కులో మంట లాంటి ఇబ్బందులను తొలగిస్తుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్‌ కళ్లకు మంచిది. చర్మ వ్యాధులు ఉన్నవారికి ఇది దివ్య ఔషధం. గజ్జితో సహా అనేక చర్మ సంబంధ రుగ్మతలను నివారించినట్లుగా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగానూ పోరాడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్