హీల్స్‌ వేస్తోంటే.. ఇవి తప్పనిసరి!

స్టైల్‌ లుక్‌ కావాలన్నా, పొడవుగా కనిపించాలన్నా అమ్మాయిల చూపు హీల్స్‌ మీదకే పోతుంది. సందర్భాన్ని బట్టి అరుదుగా వేసుకుంటే సరే! కొందరికి తరచూ వేసుకోవడం అలవాటు. కానీ ఇవేమో వీపు, మెడ, వెన్నెముకలకు హాని చేస్తాయి.

Published : 20 Sep 2022 00:28 IST

స్టైల్‌ లుక్‌ కావాలన్నా, పొడవుగా కనిపించాలన్నా అమ్మాయిల చూపు హీల్స్‌ మీదకే పోతుంది. సందర్భాన్ని బట్టి అరుదుగా వేసుకుంటే సరే! కొందరికి తరచూ వేసుకోవడం అలవాటు. కానీ ఇవేమో వీపు, మెడ, వెన్నెముకలకు హాని చేస్తాయి. కాబట్టి హీల్స్‌ వాడే వారు ఈ వ్యాయామాల్ని తప్పకుండా చేయాలంటారు నిపుణులు.

* యాంకెల్‌ సర్కిల్‌: హీల్స్‌ వేసుకోవడం వల్ల చీలమండపై ఒత్తిడి పడుతుంది. నేల మీద నిల్చొని కాలిని మోకాలికి సమాంతరంగా వంచాలి. ఆపై చీలమండను గుండ్రంగా తిప్పాలి. తర్వాత మరో కాలితోనూ ఇలాగే చేయాలి. ఒక్కో కాలిని 20సార్లు 5 సెట్లుగా చేయాలి.

* బ్యాలెన్సింగ్‌: నేలమీద ఒంటి కాలితో నిల్చోవాలి. మడిచిన కాలిని చేత్తో పట్టుకోవాలి. పాదాన్ని క్లాక్‌, యాంటీ క్లాక్‌ విధానంలో పది సార్లు చొప్పున తిప్పాలి. రెండు కాళ్లతో ఇలా మూడు సెట్లుగా చేయాలి. దీంతో చీలమండ, కాలి కండరాల్లో ఒత్తిడి తగ్గి విశ్రాంతి కలుగుతుంది.

* బాల్‌ మసాజ్‌: హీల్స్‌ వేసుకున్నప్పుడు శరీర బరువంతా మునివేళ్లపైనే పడుతుంది. వాటికి ఉపశమనం కలిగించడంలో ఇది సాయపడుతుంది. ఒక టెన్నిస్‌బాల్‌ను నేల, పాదం మధ్య ఉంచి, కాలి వేళ్లతో గుండ్రంగా తిప్పండి. కనీసం 5 నిమిషాలు చేస్తే సరిపోతుంది.

* నీ ఎక్స్‌టెన్షన్‌: కుర్చీలో కూర్చోవాలి. ఒక కాలిని చాపాలి. వీలైనంతసేపు అలాఉంచి, కిందకు దింపితే సరి. రెండు కాళ్లనూ ఇలా పదిసెట్లుగా చేస్తే మోకాళ్ల అలసట తగ్గుతుంది.


స్క్వాట్స్‌

రెండు కాళ్లను దూరంగా ఉంచి, కూర్చున్నట్లుగా ఉండాలి.

తర్వాత మునివేళ్లను పైకి లేపి, తిరిగి నేలమీద ఉంచుతుండాలి. ఇలా 15-20 సార్లు చేస్తే చీలమండ దృఢపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్