పర్వతాసనం.. రెండిందాలా మేలు!

రక్తం సవ్యంగా సరఫరా కాకపోవడం, కండరాలు బలంగా లేకపోవడం.. అనేక జబ్బులకు కారణమవుతాయి. పర్వతాసనంతో ఆ రెండు సమస్యలూ నయమై శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరడమే కాదు రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మీరే ప్రయత్నించి చూడండి...

Updated : 24 Sep 2022 00:52 IST

రక్తం సవ్యంగా సరఫరా కాకపోవడం, కండరాలు బలంగా లేకపోవడం.. అనేక జబ్బులకు కారణమవుతాయి. పర్వతాసనంతో ఆ రెండు సమస్యలూ నయమై శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరడమే కాదు రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. మీరే ప్రయత్నించి చూడండి...

ఎలా చేయాలి...

కొండ ఆకృతిని తలపించేదే పర్వతాసనం. ముందుగా నిలబడి మెల్లగా శ్వాస వదులుతూ రెండు చేతులూ రెండు పాదాల పక్కన పెట్టాలి. ముందు కుడికాలును, తర్వాత ఎడమకాలును వెనక్కి జరపాలి. పాదాలు పూర్తిగా కింద ఆనించి ఉంచాలి. తల, భుజాలు మోకాళ్ల వైపు వెళ్లాలి. వీపు, మోకాళ్లు వంచకూడదు. తిన్నగా ఉండేలా చూడాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా మోకాళ్లను కింద పెట్టేసి కూర్చున్న స్థితిలో సేదతీరాలి. ఈ ఆసనం మొదలు పెట్టినప్పుడు కొంచెం తల బరువుగా ఉంటుంది. అలా అనిపిస్తే వెంటనే రిలాక్స్‌ అయిపోండి. తర్వాత మళ్లీ చేయొచ్చు.

ఇవీ ప్రయోజనాలు

ఈ ఆసనం వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీర భాగాలు బిగుసుకుపోక, కదలికలు తేలికవుతాయి.

జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

చర్మం కాంతిమంతమవుతుంది. జుట్టు కుదుళ్లు దృఢంగా ఉంటాయి.

ఈ ఆసనం వల్ల కండరాలు బలాన్ని పుంజుకుంటాయి. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు రావు. నిద్రలేమి నుంచి బయటపడొచ్చు. సైనస్‌ సంబంధ సమస్యలన్నీ తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్