తీపి ఎక్కువ తింటే...

బరువు పెరగడం ఒక్కటే కాదు... తీపితో మరికొన్ని సమస్యలూ ఉన్నాయి... మొటిమలు, యాక్నె పెరగడానికి కారణం తీపి ఎక్కువగా తినడమే అంటున్నాయి అధ్యయనాలు.

Published : 27 Sep 2022 00:46 IST

బరువు పెరగడం ఒక్కటే కాదు... తీపితో మరికొన్ని సమస్యలూ ఉన్నాయి...

* మొటిమలు, యాక్నె పెరగడానికి కారణం తీపి ఎక్కువగా తినడమే అంటున్నాయి అధ్యయనాలు. ఇందుకోసం సంప్రదాయ వంటకాలు ఎక్కువగా తినే గ్రామీణులపైనా, శుద్ధి చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తినే పట్టణ యువతపైనా అధ్యయనం చేసినప్పుడు... యాక్నె సమస్య పట్టణ ప్రాంతపు టీనేజర్లలోనే ఎక్కువగా కనిపించింది.

* మనసు బాగోలేనప్పుడు తీయగా ఉండే కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్లు తింటాం కదా! కానీ అవి దీర్ఘకాలంలో డిప్రెషన్‌లోకి నెట్టేస్తాయట.

* ముఖంలో వయసు ఛాయలు కనిపిస్తున్నా, చర్మం సాగిపోయి ముడతలు పడుతున్నా ప్రధాన కారణం చక్కెరలే. ఇవి చర్మం సాగే గుణాన్ని కోల్పోయేలా చేస్తాయి.

* వాపులు తలెత్తడానికీ, దంతాల ఆరోగ్యం పాడవడానికీ, అజీర్తి సమస్యలకి కూడా ఎక్కువగా తీపి తినడమే కారణం. అందుకే శుద్ధి చేసిన చక్కెర్లు అంటే పంచదార ఉండే స్వీట్లకి దూరంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్