ఆనందాల వేళ.. ఆరోగ్యం జాగ్రత్త!
పండగ నాడు తెల్లవారుజామునే మనకు పని మొదలు. పూజ, పిండి వంటలు అయ్యే సరికి ఆలస్యమవుతుంది. అందుకే వేడుక ఆనందం కంటే మన ముఖాల్లో అలసటే ఎక్కువగా కనిపిస్తుంది. అలా కాకూడదంటే..
పండగ నాడు తెల్లవారుజామునే మనకు పని మొదలు. పూజ, పిండి వంటలు అయ్యే సరికి ఆలస్యమవుతుంది. అందుకే వేడుక ఆనందం కంటే మన ముఖాల్లో అలసటే ఎక్కువగా కనిపిస్తుంది. అలా కాకూడదంటే..
* మరుసటి రోజుకి అన్నీ సిద్ధం చేసుకోవాలని ఆలస్యంగా పడుకుంటాం. ఉదయాన్నే త్వరగా లేస్తాం. నిద్రెక్కడ సరి పోతుంది? నిద్రలేమీ నీరసాన్ని తెస్తుంది. కాబట్టి, పనులన్నీ ముగించుకొని త్వరగా పడుకునేలా ప్లాన్ చేసుకోండి. గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ సాల్ట్, నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని పాదాలను ఉంచితే.. మనసు తేలికపడి త్వరగా నిద్రపడుతుంది.
* పూజ అయ్యే వరకూ మంచి నీళ్లనీ ముట్టుకోని వారెందరో! అది మంచి పద్ధతికాదు. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని తాగితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే త్వరగా ఆకలనిపించదు. సత్తువా ఉంటుంది.
* ఆకలనిపిస్తే నోరు కట్టేసుకోవద్దు. నీరసం ఆవరిస్తుంది. పనీ వేగంగా చేయలేం. గంటలపాటు ఖాళీ కడుపుతో ఉండి, ఒకేసారి సుష్టుగా భోజనం చేసినా అది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. చాలాసార్లు గ్యాస్ పట్టేయడం, అజీర్తి వంటివీ వస్తాయి. తిన్నదీ సరిగా అరగదు. పండ్లు, పండ్ల రసాలు, పాలు, నట్స్ వంటివి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయులు పడిపోకుండా ఉంటాయి. శరీరానికి అవసరమైన మినరల్స్ కూడా అందుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.