కృష్ణఫలం తింటున్నారా లేదా...

చురుగ్గా, చలాకీగా ఉండే అమ్మాయిలు కూడా నెలసరి వచ్చిందంటే ఇబ్బంది పడిపోతారు. ఉత్సాహాన్ని ఎవరో లాగేసుకున్నట్టుగా నీరసంగా, నిస్సత్తువగా కనిపిస్తారు. కొందరైతే పీరియడ్స్‌ సమయానికి రాకపోవడం లేదా ముందుగానే వచ్చేయడం, విపరీతమైన కడుపునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలా నెలసరిలో అపసవ్యతలను నివారిస్తుంది కృష్ణఫలం.

Updated : 22 Nov 2022 16:11 IST

చురుగ్గా, చలాకీగా ఉండే అమ్మాయిలు కూడా నెలసరి వచ్చిందంటే ఇబ్బంది పడిపోతారు. ఉత్సాహాన్ని ఎవరో లాగేసుకున్నట్టుగా నీరసంగా, నిస్సత్తువగా కనిపిస్తారు. కొందరైతే పీరియడ్స్‌ సమయానికి రాకపోవడం లేదా ముందుగానే వచ్చేయడం, విపరీతమైన కడుపునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలా నెలసరిలో అపసవ్యతలను నివారిస్తుంది కృష్ణఫలం.

సీతాఫలం, రామాఫలం తెలుసు కానీ చాలామందికి కృష్ణఫలం గురించి తెలీదు. అరటి, జామల్లా దీనికంతగా ప్రచారం లేనప్పటికీ ఎంతో మేలుచేసే పండిది. ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ ఫలం ప్యాషన్‌ ఫ్రూట్‌గా ప్రసిద్ధం. పోషక భరితం, శ్రేష్ఠం కనుక దీన్ని తినడం అలవాటు చేసుకోమంటున్నారు నిపుణులు.

చలికాలంలో అడుగుపెట్టాం కదూ! పగలంతా ఎండ, రాత్రిపూట చలి, మధ్యమధ్యలో వర్షాలు.. అన్నీ కలగలసిన ఇలాంటి వాతావరణంలో శరీరం అనారోగ్యానికి గురవడం లేదా చురుకుదనం కోల్పోయి మొద్దుబారినట్లుండటం కద్దు. అలాంటి స్థితి నుంచి బయట పడేస్తుంది కృష్ణఫలం.

దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు దండిగా ఉంటాయి.

ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కండరాలు, రక్తనాడులకు మంచిది. చర్మం ముడతలు పడదు, నిగారింపు వస్తుంది. తాపం తగ్గుతుంది. మంట, గాయాలు, అలసటల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఊపిరితిత్తులు బలోపేతమౌతాయి. శ్వాస సమస్యలు తొలగుతాయి.

కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్రలేమిని, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది.

హృద్రోగాలను అరికడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.  

ఈ పండు అన్నిచోట్లా లభించదు. రైతుబజార్‌ లేదా ఆర్గానిక్‌ మార్కెట్లలో దొరుకుతుంది. దీన్ని చెక్కు తీసి యథాతథంగా తినొచ్చు. లేదా జ్యూస్‌, మిల్క్‌షేక్‌, స్మూథీల రూపంలో తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్